మన్మథుడు 2: ఆ ఇద్దరు ఫిక్స్?

మన్మథుడు 2: ఆ ఇద్దరు ఫిక్స్?

మన్మథుడు సీక్వెల్ పై నాగ్ గట్టి నమ్మకంతో ఉన్నాడనిపిస్తోంది. మొదటి సినిమాతో పెద్దగా హిట్ అందుకోని రాహుల్ రవీంద్రన్ చెప్పిన స్క్రిప్ట్ ను నమ్మి సీక్వెల్ కి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు మన సీనియర్ హీరో. సుశాంత్ తో చి.లా.సౌ అనే సినిమా తీసి నాగార్జునను ఎట్రాక్ట్ చేసిన రాహుల్ హీరోయిన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు.

60 ఏళ్ల వయసు దగ్గరపడుతున్న సమయంలో కూడా నాగ్ ని నవ మన్మథుడిగా చూపించాలని అదిరిపోయే స్క్రిప్ట్ ను రెడీ చేశాడట. ఇక నాగ్ సరసన నటించే హీరోయిన్లు యంగ్ గా ఉండాలని గత కొన్ని రోజులుగా చర్చలు జరిపిన ఈ టీమ్ ఫైనల్ గా పాయల్ రాజ్ పూత్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మరో హీరోయిన్ అనుష్కని కూడా అనుకుంటున్నట్లు టాక్. అంటే మన్మథుడు 2లో ఇద్దరు హీరోయిన్స్ అన్నమాట. ఆర్ఎక్స్ 100 పిల్ల పాయల్ కి ఈ మధ్య అనేక ఆఫర్స్ వచ్చినప్పటికీ అమ్మడు ఎంతో ఆలోచించి గాని ఒకే చేయడం లేదు. ఇక ఈ స్క్రిప్ట్ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లో ఒకే చేసిందట.

అలాగే స్వీటి అనుష్క కూడా నాగ్ తో అవకాశం వస్తే ఏ మాత్రం నో చెప్పదని అందరికి తెలిసిందే. సూపర్ సినిమాలో నాగ్ సరసన నటించి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాహుబలి బ్యూటీ ఛాన్స్ వచ్చిన ప్రతిసారి జస్ట్ గెస్ట్ రోల్స్ అయినా కూడా నాగ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ముందుకు వస్తోంది. ఇక ఇప్పుడు మన్మథుడు సీక్వెల్ అంటే డేట్స్ కుదరకపోయినా అడ్జస్ట్ చేసుకొని మరి వాలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.  మార్చ్ 12న సినిమాను లాంచ్ చేయాలని నాగ్ ఆలోచిస్తున్నాడు. మరి హీరోయిన్ల పేరును అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English