బోయపాటి సెగ ఆమెకీ తగిలింది

బోయపాటి సెగ ఆమెకీ తగిలింది

'భరత్‌ అనే నేను' చిత్రంతో తెలుగునాట అడుగు పెట్టిన కియారా అద్వానీకి వరుసగా చాలా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా స్టార్‌ హీరోల సినిమాలకి ఆమెని కన్సిడర్‌ చేసారు.

'వినయ విధేయ రామ'లో రామ్‌ చరణ్‌తో నటించిన కియారా ఈ ఏడాదిలో మరో రెండు పెద్ద సినిమాలు చేజిక్కించుకునేలానే కనిపించింది. అయితే 'వినయ విధేయ రామ' ఫెయిల్యూర్‌తో మొత్తం మారిపోయింది.

ఈ చిత్రం విడుదలకి ముందు ఆమె పేరు పరిశీలించిన సినిమాల్లో ఇప్పుడు కియారాకి ఛాన్స్‌ రావడం లేదు. అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ చేస్తోన్న చిత్రంలో కియారా కన్‌ఫర్మ్‌ అనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడామెకి బదులుగా పూజా హెగ్డేని సంప్రదించారట. అలాగే రాజమౌళి తీస్తోన్న మల్టీస్టారర్‌లో కూడా కియారా ఒక కథానాయికగా నటిస్తుందని అన్నారు.

కానీ ఇప్పుడు అదీ జరగడం లేదు. ఒక్క సినిమా ఫెయిల్యూర్‌తో సడన్‌గా క్రేజ్‌ కోల్పోయిన కియారా అద్వానీ ఇప్పుడు 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్‌పై దృష్టి పెట్టింది. ఈ చిత్రం సక్సెస్‌ అయితే బాలీవుడ్‌లో బిజీ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English