బెల్లంకొండ ఎప్పటికీ కరగదా?

బెల్లంకొండ ఎప్పటికీ కరగదా?

బెల్లంకొండ శ్రీనివాస్‌ను చూస్తే అటు ఇండస్ట్రీ జనాలకు.. ఇటు ప్ర్రేక్షకులకు చాలా సందేహాలు కలుగుతుంటాయి. అతను ఇప్పటిదాకా ఐదు సినిమాలు చేశాడు. అందులో నిఖార్సయిన హిట్టు ఒక్కటీ లేదు. కానీ అతడి ప్రతి సినిమాలో భారీ తారాగణం ఉంటుంది. భారీ బడ్జెట్లు పెడుతుంటారు. సినిమా ఫెయిలైనా ఎవరిలో ఏ ఆందోళన కనిపించదు. అతడి నిర్మాతలు థిలాసాగా ఉంటారు. దీని మర్మం ఏంటో అందరికీ అర్థం కాదు. కానీ శ్రీనివాస్‌కు ఉన్న బ్యాకప్ అతడి తండ్రి బెల్లంకొండ సురేషే అని తెలిసింది కొందరికే.  

శ్రీనివాస్ తొలి సినిమా ‘అల్లుడు శీను’ ఉన్నంతలో బాగానే ఆడింది. కానీ విపరీతమైన ఖర్చు వల్ల ఆ చిత్రానికి రూ.15 కోట్ల దాకా నష్టం వాటిల్లింది. ఆ తర్వాత నటించిన నాలుగు సినిమాల పరిస్థితీ ఇంతే. తొలి సినిమా తర్వాత వేరే నిర్మాతల్ని ముందు పెట్టి సినిమాలు తీయించాడు సురేష్. ఆ నిర్మాతలెల్వరూ కూడా పూర్తి పెట్టుబడి పెట్టలేదన్నది స్పష్టం.

సురేష్‌కు ఫైనాన్షియర్లతో, బయ్యర్లతో సమస్యలుండటం వల్ల అతను నేరుగా సినిమాలు నిర్మించే పరిస్థితి లేదు. కానీ శ్రీనివాస్ ప్రతి సినిమా వెనుకా ఆయన ఉంటాడు. అన్నీ తానై వ్యవహరిస్తాడుు. నిర్మాతగా పేరు పడే వ్యక్తి నామమాత్రంగా పెట్టుబడి పెడితే.. సురేషే అంతా చూసుకుంటాడు. ఐతే కొడుకు కోసం ఇలా చేయడంలో తప్పేమీ లేదు. కానీ శ్రీనివాస్ సినిమాల మీద అయిన కాడికి డబ్బులు పెట్టేస్తుండటమే విడ్డూరం. ఇప్పటిదాకా కొడుకు మీద సురేష్ కనీసం .50 కోట్లయినా నష్టపోయి ఉంటాడని అంచనా.

అయినా ఆయనేమీ కంగారు పడుతున్నట్లు లేదు. వరుసగా ఐదు ఫ్లాపులు ఎదురైనా శ్రీనివాస్‌కు సినిమాలేమీ ఆగిపోలేదు. ఆల్రెడీ తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ ఇంకో రెండు చిత్రాలు లైన్లో పెట్టాడు. శ్రీనివాస్ సినిమా అంటే మినిమం రూ.20 కోట్లయినా బడ్జెట్ ఉండాల్సిందే. ఈ విషయంలో రాజీ అన్నదే లేదు. ఐతే సురేష్ దగ్గర ఇంకా ఎన్ని కోట్లున్నాయి.. కొడుకు మీద ఇంకా ఎంత తగలేస్తాడని ఇండస్ట్రీ జనాలు చర్చించుకుంటున్నారు.

శ్రీనివాస్ తమ్ముడు సైతం హీరో కావాల్సి ఉంది. ఆ ప్రపోజల్ చాలా కాలంగా ఉంది. మరి పెద్ద కొడుకు మీదే ఇంత పెట్టేస్తే.. అతడు కూడా రంగంలోకి దిగితే ఇంకెన్ని కోట్లు ఖర్చవుతాయన్నది ప్రశ్న. మరి అంతలా బెల్లంకొండ ఎలా సంపాదించేశాడో.. ఇలా పదుల కోట్లు పోతున్నా ఎలా ప్రశాంతంగా ఉంటున్నాడో అన్నది ఇండస్ట్రీ జనాలకు అంతు బట్టకుండా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English