ఇక స్టార్ డైరెక్టర్ అనేద్దామా?

ఇక స్టార్ డైరెక్టర్ అనేద్దామా?

చిన్న స్థాయి సినిమాలతో సాగిపోతున్న వాళ్లకు కూడా సరైన సమయంలో సరైన విజయాన్నందుకుంటే అందరి దృష్టీ వాళ్లపై పడుతుంది. ఊహించని రేంజికి వెళ్లిపోతారు. ఇప్పుడు అనిల్ రావిపూడి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అనిల్ ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. సంక్రాంతికి రిలీజైన ‘ఎఫ్-2’ సినిమాతో అతడి రేంజ్ అమాంతం పెరిగిపోయింది. దీని కంటే ముందే మూడు హిట్లు కొట్టినప్పటికీ.. ‘ఎఫ్-2’ ఇచ్చిన కిక్ వేరు. ఇప్పుడు టాలీవుడ్ బడా హీరోలు అనిల్‌తో పని చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్రెడీ అతడితో చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. వెంటనే కాకపోయినా.. కుదిరినపుడు అనిల్‌తో చేయడానికి వేరే స్టార్లు కూడా ఆసక్తితో ఉన్నారని.. అతడి నుంచి కమిట్మెంట్లు తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు  కూడా వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ సైతం అనిల్‌తో పని  చేసే అవకాశముంది. వెంకటేష్ సైతం మళ్లీ అనిత్‌తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు.

హ్యాాట్రిక్ హిట్లు కొట్టినప్పటికీ అనిల్‌ను మొన్నటిదాకా ఒక సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా మాత్రమే చూశారు. మీడియం రేంజిలో నిలబెట్టారు. కానీ ఇప్పుడు అతడిని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా పరిగణిస్తున్నారు. టాప్ లీగ్‌లో తీసుకెళ్లి కూర్చోబెట్టేశారు. సుకుమార్, త్రివిక్రమ్ స్థాయి దర్శకుల సరసన నిలుస్తున్నాడతను. ఇదంతా ‘ఎఫ్-2’ పుణ్యమే. రైట్ టైంలో రైట్ సినిమా పడితే ఎలా దశ తిరుగుతుందో చెప్పడానికి అనిలే నిదర్శనం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English