యాక్టింగ్ లో బిజీ అవుతున్నాడు

యాక్టింగ్ లో బిజీ అవుతున్నాడు

డైరెక్టర్స్ యాక్టర్స్ అవ్వడం అనేది చాలా రేర్. మన దగ్గర స్టార్ దర్శకులు ఎంత మంది ఉన్నా కూడా నటనలో ఎక్కువగా ప్రయోగాలు చేయకుండా కెమెరా వెనకే ఉండి నటీనటులకు యాక్టింగ్ చేసి చూపిస్తారు. వాళ్ళు తెరపైకి వస్తే అద్భుతమైన నటి నటులు అవ్వగలరు. అసలు మ్యాటర్ లోకి వస్తే అర్బన్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు నటనలో కూడా అడుగులు వేసేస్తున్నాడు.

పెళ్లి చూపులు సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన మనోడు ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది ఈ వేళ అనే సినిమాతో మరో సారి తన టాలెంట్ ను చూపించాడు. అయితే ఉన్నట్లుండి రూటు మార్చి యాక్టర్ అయిపోయాడు. మహానటి సినిమాలో సీనియర్ దర్శకుడైనా సింగీతం శ్రీనివాసరావు క్యారెక్టర్ లో సాఫ్ట్ గా కనిపించిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఫలక్ నుమా దాస్ సినిమాలో తెలంగాణ మాస్ పోలీస్ ఎస్సైగా నటించి మళ్ళీ ఎవరు ఊహించని రీతిలో అందరినీ ఇంప్రెస్ చేశాడు. తదుపరి విజయ్ దేవరకొండ తన సొంత ప్రొడక్షన్ లో నిర్మించబోయే మొదటి సినిమాలో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తానికి డైరెక్టర్ గా కంటే యాక్టర్ గానే తరుణ్ బిజీ అవుతున్నాడు.

యాక్టర్ గా ఎంత బిజీగా మారినా కుడా డైరెక్షన్ వర్క్ ని కూడా తరుణ్ ఏ మాత్రం పక్కన పెట్టడం లేదు. నెక్స్ట్ మరో డిఫరెంట్ కథతో రావడానికి ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ సురేష్‌ ప్రొడక్షన్స్ కాంపౌండ్ లో స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోందట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English