అదిరిపోయే థ్రిల్లర్.. వీళ్లేం చేస్తారో?

అదిరిపోయే థ్రిల్లర్.. వీళ్లేం చేస్తారో?

తమిళంలో గత ఏడాది వచ్చిన అత్యుత్తమ చిత్రాల్లో ‘రాక్షసన్’ ఒకటి. మొత్తంగా తమిళ సినీ చరిత్రలోనే బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటిగా ఇది పేరు తెచ్చుకుంది. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని విధంగా ‘రాక్షసన్’ను రూపొందించాడు యువ దర్శకుడు రామ్ కుమార్. విష్ణు విశాల్ హీరోగా నటిస్తూ.. స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. చాలా పెద్ద హిట్టయిన ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి వివిధ భాషల నుంచి ఆఫర్లు వచ్చాయి.

 రిలీజైన కొన్ని రోజుల్లోనే తెలుగు రీమేక్ కూడా ఓకే అయింది. ముందు నితిన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుందన్నారు. కానీ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ చేతికి సినిమా వెళ్లింది. దర్శకుడు రమేష్ వర్మను రీమేక్ కోసం ఎంచుకున్నారు. కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఇందులో శ్రీనివాస్‌కు జోడీగా రకుల్ ప్రీత్ నటిస్తుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.

ఐతే ఈ కాంబినేషన్లో ‘రాక్షసన్’ రీమేక్ ఏమాత్రం వర్కవుటవుతుందో అన్న సందేహాలు కలుగుతున్నాయి. రమేష్ వర్మ బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ టైపు. పబ్లిసిటీ డిజైనర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అతను.. దర్శకుడిగా తన తొలి సినిమా ‘ఒక ఊరిలో’కు ఎంత హడావుడి చేశాడో గుర్తుండే ఉంటుంది. అది తుస్సుమంది. తర్వాత నిర్మాతగా మారి ‘మల్లెపువ్వు’ తీశాడు. అదీ పోయింది. ఆపై ఓ కొరియన్ సినిమాను కాపీ కొట్టి ‘రైడ్’ తీస్తే అది ఒక మాదిరిగా ఆడింది.

ఆపై బాలయ్యతో ఒక సినిమా అన్నాడు. కుదర్లేదు. ఆయనతో అనుకున్న కథతోనే రవితేజను పెట్టి ‘వీర’ తీస్తే డిజాస్టర్ అయింది. చివరగా నాగశౌర్యతో ‘అమ్మాయితో అబ్బాయి’ అనే సినిమా తీసి హడావుడి చేశాడు. అదీ తుస్సుమంది. ఇలాంటి ట్రాక్ రికార్డున్న దర్శకుడు ‘రాక్షసన్’ లాంటి ఇంటెన్స్ థ్రిల్లర్‌ను ఏమాత్రం డీల్ చేస్తాడో అని సందేహాలు కలుగుతున్నాయి. అసలే బెల్లంకొండ శ్రీనివాస్ అనేక విషయాల్లో వీక్.ఇప్పటిదాకా అతడివన్నీ బిల్డప్ సినిమాలే. నటుడిగా ఏమీ రుజువు చేసుకున్నది లేదు. అలాంటి హీరో.. ఇలాంటి దర్శకుడు కలిసి ‘రాక్షసన్’ రీమేక్‌ను ఏం చేస్తారో ఏమో మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English