అనిల్ రావిపూడి ఆ పాత్ర చేసి ఉంటే..

అనిల్ రావిపూడి ఆ పాత్ర చేసి ఉంటే..

‘పటాస్’తో మొదలుపెట్టి.. ‘ఎఫ్-2’ వరకు అప్రతిహతంగా సాగుతోంది యువ దర్శకుడు అనిల్ రావిపూడి జైత్రయాత్ర. అతడి సిినమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్టవుతున్నాయి. ముఖ్యంగా ‘ఎఫ్-2’ అయితే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. అనిల్‌ను తెలుగులో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడిగా చేసింది.

విశేషం ఏంటంటే అనిల్ చూడ్డానికి హీరోలా ఉంటాడు. అతను చక్కగా నటించగలడని కూడా చెబుతుంటారు. ఐతే స్వయంగా అనిలే తనకు నటన పట్ల ఉన్న ఆసక్తి గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తన కోసం తాను ఒక పాత్ర కూడా రాసుకున్నట్లు అతను వెల్లడించాడు. అంతా అనుకున్న ప్రకారం జరిగితే అతను చాలా ఏళ్ల కిందటే నటుడిగా మారాల్సిందట.

రచయితగా అనిల్ కెరీర్ ఆరంభంలో చేసిన ‘కందిరీగ’ సినిమాలో తన కోసం ఒక పాత్ర రాసుకున్నాడట అనిల్. ఆ చిత్రంలో సప్తగిరి ‘యాడికిరా పొయ్యేది’ అంటూ చెప్పే డైలాగ్.. అతడి ఎపిసోడ్ భలే ఫన్నీగా ఉంటాయి. సినిమాలో ఆ కామెడీ బాగా పేలింది. ఈ పాత్ర.. ఈ డైలాగ్ తనకోసమే రాసుకున్నట్లు అనిల్ వెల్లడించాడు.
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు ఈ విషయం చెప్పి.. సినిమాలో తానే సరదాగా ఆ పాత్ర చేస్తానని అన్నాడట అనిల్. అతను కూడా సరే అన్నాడట. ఐతే ఆ రాత్రి పడుకునే ముందు ఆలోచనలో పడ్డాడట అనిల్. మనం రైటింగ్, డైరెక్షన్ మీద ఫోకస్ పెడుతూ.. మధ్యలో డీవియేట్ కావడం ఎందుకు అనిపించిందట. దీంతో తర్వాతి రోజు ఆ పాత్ర తాను చేయనని, సప్తగిరికి ఇద్దామని సజెస్ట్ చేశాడట. అలా ఆ సినిమాతో నటుడిగా మారే అవకాశాన్ని తనకు తానే వదులుకున్నానని.. మళ్లీ ఇంకెప్పుడూ నటన గురించి ఆలోచించలేదని అనిల్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English