వాటే తెలివమ్మా 'యాత్ర' టీమ్

వాటే తెలివమ్మా 'యాత్ర' టీమ్

యాత్ర ను వైఎస్సార్ బయోపిక్ అనాలా? లేక పొలిటికల్ ప్రచారంలో వచ్చిన యాత్ర సినిమా అనాలా? అనే కన్ఫ్యూజన్ లో చాలా మంది ఉన్నట్లు స్పెషల్ గా చెప్పనవసరం లేదు. వైఎస్సార్ రాజకీయాల్లో ఎలాంటి అడుగులు వేశారో అందరికి తెలిసిందే. అయితే వెండితెరపై ఎమోషనల్ గా మచ్చ లేకుండా చూపిస్తే అది ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అనేది చిత్ర యూనిట్ కె తెలియాలి.
 
ఇకపోతే యాత్ర సినిమాపై కొన్ని వర్గాల వారు చేస్తోన్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మెయిన్ గా పొలిటికల్ పంచేస్ ఎక్కువగా వస్తుండడంతో సినిమాను పొగడమని ఎవరిని అడగాల్సిన పని లేదని దర్శకుడు మహి వి రాఘవ సోషల్ మీడియాలో ఇంగ్లీష్ కవిత రూపంలో చెబుతున్నాడు. ఒక మంచి నాయకుడి కథను తెరకెక్కించిన సంతృప్తి ఉందని అన్నారు. అయితే ఎవరి పొగడ్తలు అవసరం లేదంటూనే.. మరో ప్రక్కన సినిమాను పొగిడిన సెలబ్రిటీస్ ట్వీట్స్ ను పోస్టర్స్ కు తగిలించి మళ్ళీ ప్రమోషన్స్ చేసే పనిలో పడ్డారు. పొగిడిన వారి ట్వీట్స్ ను పోస్టర్స్ గా వేస్తుండడంతో ఆ విషయం కాస్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.దీంతో నెటీజన్స్.. వాటే..తెలివి.. అంటూ దర్శకుడు మహిపై సెటైర్లు వేస్తున్నారు.

యాత్ర సినిమాకు ఓపెనింగ్స్ డీసెంట్ గా ఉన్నా ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ లానే తగ్గుతూ ఉన్నాయి. ప్రశంసలు ఎన్ని వచ్చినా రెగ్యులర్ ఆడియెన్స్ మాత్రం యాత్ర బయోపిక్ పై అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక మహిళ ప్రేక్షకుల ఆదరణతో బ్లాక్ బస్టర్ అని తెలివిగా ట్వీట్స్ తో బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English