చరణ్‌ మేటర్‌లో చిరు నాట్‌ హ్యాపీ

చరణ్‌ మేటర్‌లో చిరు నాట్‌ హ్యాపీ

'వినయ విధేయ రామ' చిత్రానికి వచ్చిన లాస్‌లని చరణ్‌, దానయ్య కొంతమేర భరించారనే సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం వ్యాపార లావాదేవీల్లో చరణ్‌ ఇంటర్‌ఫియర్‌ కావడం, స్వచ్ఛందంగా నష్ట పరిహారం ఇవ్వడం చిరంజీవికి నచ్చలేదట. వినయ విధేయ రామ చిత్రానికి బయ్యర్లు భారీ స్థాయిలో నష్టపోలేదు. అరవై కోట్ల పైగానే షేర్‌ రావడంతో బయ్యర్లు కిమ్మనలేదు. ఎలాగో సినిమాని కింది సెంటర్లకి థర్డ్‌ పార్టీలకి అమ్మేయడం వల్ల నష్టం ఒక్కరి మీదే కాకుండా పలువురికి షేర్‌ అయింది. అందుకే ఈ చిత్రానికి బయ్యర్లు గగ్గోలు పెట్టలేదు.

కానీ ఇలాంటి సినిమా చేసినందుకు చరణ్‌ నైతిక బాధ్యత తీసుకుని బహిరంగ క్షమాపణ లేఖ రాయడమే కాకుండా, పారితోషికంలో కూడా మూడో వంతు తిరిగి ఇచ్చేసాడు. బయ్యర్లు కంప్లయింట్‌ చేయకుండానే చరణ్‌ ఈ డెసిషన్‌ తీసుకున్నాడనే సంగతి చిరంజీవి దృష్టికి వెళ్లిందట. సినిమా వ్యాపారంలో లాభ నష్టాలు మామూలేనని, భారీ నష్టాలు రానపుడు, బయ్యర్లు పరిహారం ఆశించనపుడు ఇలా స్వఛ్ఛందంగా డబ్బులు తిరిగి ఇవ్వరాదని, దీని వల్ల ముందు ముందు కూడా స్వల్ప నష్టాలకి కూడా పరిహారం ఆశిస్తారని చిరంజీవి తనయుడికి క్లాస్‌ పీకినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. సైరా వ్యాపార విషయాల్లో చరణ్‌ ఇలా సెన్సిటివ్‌గా వ్యవహరిస్తాడేమోనని చిరంజీవి ముందే జాగ్రత్త పడినట్టున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English