బాలకృష్ణ దిల్‌ ఖుష్‌ జేషిండు!

బాలకృష్ణ దిల్‌ ఖుష్‌ జేషిండు!

ఎన్టీఆర్‌ బయోపిక్‌ అనగానే జనం ఎగబడి థియేటర్లకి వచ్చేస్తారని అందరూ చాలా ఎక్కువ అంచనా వేసారు. తీసినవాళ్లు, కొన్నవాళ్లు, అభిమానులు అంతా ఒక ప్రభంజనం ఎక్స్‌పెక్ట్‌ చేసారు. క్రిష్‌ అయితే ఒక చారిత్రిక చిత్రం తీస్తున్నాననే బలంగా నమ్మాడు. కానీ ఎన్టీఆర్‌ బయోపిక్‌ని జనం పట్టించుకోలేదు. ఫలితంగా యాభై కోట్లకి పైగా నష్టాలతో బయ్యర్లు కుదేలయ్యారు. చిన్నా చితకా లాస్‌లు అయితే భరించవచ్చు కానీ మరీ ఇలా రోడ్డుకి లాగేసే నష్టాలొస్తే ఎవరైనా ఎలా తట్టుకోగలరు? అందుకే రెండవ భాగంతో బయ్యర్లని ఆదుకునేందుకు బాలకృష్ణ అందరితో సమావేశమై అందరికీ దిల్‌ ఖుష్‌ చేసి పంపించాడు. తన తండ్రి కథతో తీసిన సినిమా వల్ల ఎవరికీ నష్టం జరగకూడదని, మొదటి భాగంతో వచ్చిన నష్టాల్లో మూడో వంతు తాను భరిస్తానని చెప్పాడు.

అంతే కాకుండా రెండవ భాగంతో వచ్చే రెవెన్యూలో నలభై శాతం షేర్‌ అదే బయ్యర్లతో షేర్‌ చేసుకుంటానని మాటిచ్చాడు. నిజానికయితే బాలకృష్ణ అసలు నష్టం భరించేది లేదు పొమ్మన్నా అడగడానికి లేదు. వ్యాపారంలో లాభ నష్టాలు మామూలే కనుక నష్టపోయిన వారిని ఆదుకోవాలని రూలేమీ లేదు. కానీ తన పేరు మీద పెట్టిన బ్యానర్‌పై తొలి సినిమా, తన తండ్రి జీవిత కథతో తెరకెక్కిన చిత్రం కొందరికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోరాదని బాలయ్య ఇలా డిసైడ్‌ చేసాడు. అయితే ఈ నెల 22న విడుదలయ్యే రెండవ భాగం ప్రేక్షకులని థియేటర్లకి రప్పిస్తుందా లేదా అనేదే తేలాలిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English