ఆమె ముద్దులన్నీ వేస్ట్‌ అయిపోయాయ్‌

ఆమె ముద్దులన్నీ వేస్ట్‌ అయిపోయాయ్‌

అర్జున్‌ రెడ్డి తమిళ రీమేక్‌ 'వర్మ'ని పూర్తిగా ఆపేసి, మళ్లీ ఫ్రెష్‌గా తీస్తున్నారనేది తెలిసిందే. వర్మ చిత్రం ఫస్ట్‌ కాపీ చూసుకుని నిర్మాతలు చెప్పిన అభ్యంతరాల్లో హీరోయిన్‌ ఒకటట. ఇందులో మేఘా చౌదరి హీరోయిన్‌గా నటించింది. అర్జున్‌రెడ్డి అంటేనే కిస్సుల దండకం కనుక ఆమె చాలా లిప్‌ లాక్‌ సీన్స్‌లో నటించింది. యువ హీరో ధృవ్‌తో ఆమె చాలా హాట్‌ దృశ్యాల్లో కనిపించింది. కానీ ఆమె వల్ల సినిమాకి హెల్ప్‌ అవదంటే మేఘా చౌదరిని తొలగించేసారు.

ఆమె స్థానంలో ఎవరైనా క్రేజీ నటిని తీసుకోవాలని చూస్తున్నారు. బాలా డైరెక్ట్‌ చేసినది మొత్తం పక్కన పడేసి మళ్లీ తీయాలని డిసైడ్‌ అయ్యారు. మరికొద్ది రోజుల్లో సినిమా రిలీజ్‌ అయితే యువత మనసులు గెలుచుకుందామని చూస్తోన్న మేఘా చౌదరి కష్టం వృధా అయిపోయింది. అర్జున్‌ రెడ్డిలో నటించిన షాలిని పాండే ఇప్పుడెంత బిజీగా వుందో తెలిసిందే. అదే విధంగా తాను కూడా బిజీ యాక్టర్‌ అయిపోతానని చూస్తోన్న మేఘాకి చుక్కెదురైంది. స్క్రాప్‌ చేసినా మళ్లీ తననే కథానాయకిగా తీసుకుంటారనే నమ్మకంతో వున్న తనకి నిర్మాతలు షాకిచ్చారు. బాలీవుడ్‌ హీరోయిన్ల పేర్లు పరిశీలిస్తూ ఎలాగైనా ఈ చిత్రానికి క్రేజ్‌ తేవాలని చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English