రావిపూడి సుడి అలాగుంది

రావిపూడి సుడి అలాగుంది

ఎఫ్‌ 2 చూసిన వారు ఎవరైనా కానీ ఆ సెకండ్‌ హాఫ్‌ గురించి కంప్లయింట్‌ చేస్తారు. ఏమాత్రం కథకి పొంతన లేకుండా ఇష్టానికి తీసేసాడనే సంగతి స్పష్టంగా తెలుస్తుంది. అయినా కానీ పండక్కి ఫ్యామిలీ సినిమా అదొక్కటే కావడం, ఫస్ట్‌ హాఫ్‌లో కామెడీ బాగా పేలడంతో పెద్ద బ్లాక్‌బస్టర్‌ అయింది. పటాస్‌ మినహా అనిల్‌ రావిపూడి ఇంతవరకు తీసిన సినిమాలన్నిట్లోను లూప్‌ హోల్స్‌ కోకొల్లలు. అయినా కానీ అన్నీ బాక్సాఫీస్‌ వద్ద వర్కవుట్‌ అయిపోతున్నాయి. ఎఫ్‌2తో అయితే అతను పెద్ద హీరోల దృష్టిలోను పడిపోయాడు. దూకుడు చిత్రానికి సహ రచయితల్లో ఒకడైన అనిల్‌ రావిపూడిపై మహేష్‌కి అప్పుడే గురి కుదిరింది. అతను ఎఫ్‌2తో పెద్ద హిట్‌ కొట్టే సరికి పిలిపించి కథ వుంటే చెప్పమన్నాడు.

అనిల్‌ తన దగ్గరున్న కథ ఒకటి వినిపిస్తే మహేష్‌ వెంటనే డెవలప్‌ చేయమని చెప్పాడట. అన్నీ కుదిరితే ఈ చిత్రమే మహర్షి తర్వాత మహేష్‌ చేసేదట. మహా మహా దర్శకులకే మహేష్‌ డేట్స్‌ దొరకడం లేదిపుడు. కానీ అనిల్‌ రావిపూడి టైమ్‌ ఎంత బాగుందంటే అటు సినిమా బ్లాక్‌బస్టర్‌ అయిపోవడమే కాకుండా సూపర్‌స్టార్‌ని డైరెక్ట్‌ చేసే ప్రమోషన్‌ వచ్చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English