చరణ్‌ కోసమే ఆలియా భట్‌!

చరణ్‌ కోసమే ఆలియా భట్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో ఇంతవరకు హీరోయిన్లు ఖరారు కాలేదనే సంగతి తెలిసిందే. నేషనల్‌ వైడ్‌ మార్కెట్‌ని టార్గెట్‌ చేస్తున్నారు కనుక హీరోయిన్లకి దేశ వ్యాప్తంగా గుర్తింపు వుండాలని రాజమౌళి భావిస్తున్నాడు. అందుకే ఆలియా భట్‌ డేట్స్‌ కోసం చూస్తున్నాడు. ఆలియా భట్‌ని తీసుకోవడం సరే... ఇంతకీ ఇద్దరు హీరోల్లో ఎవరి సరసన ఆమె నటిస్తున్నట్టు? రామ్‌ చరణ్‌ పాత్రకి జోడీగానే ఆలియా భట్‌ని సంప్రదించారట. ఇందులో చరణ్‌ బ్రిటిష్‌ వారి దగ్గర పని చేసే పోలీస్‌ ఉద్యోగిగా కనిపిస్తాడట.

ఎన్టీఆర్‌ ఏమో గజదొంగ పాత్రలో కనిపిస్తాడట. అతనికి జోడీగా ఫారినర్‌ని తీసుకుంటారని చెప్పుకుంటున్నారు. మరి కేవలం ఫారినర్‌ మాత్రమే వుంటుందో లేక ఎన్టీఆర్‌కి ఇండియన్‌ బ్యూటీని కూడా ఎవరినైనా తోడిస్తారో తెలియదు. హీరోల పాత్రల పరంగా, నేపథ్యం పరంగా, కథాపరంగా ఈ చిత్రం అంతగా ఎక్సయిట్‌ చేయకపోయినా కాంబినేషన్‌ క్రేజ్‌కి తోడు రాజమౌళి దర్శకుడు కావడం వల్ల ఈ చిత్రానికి అన్ని వైపుల నుంచి భారీ రేటు పలుకుతోంది. బాహుబలి కంటే దీనికే ఎక్కువ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారంటేనే బిజినెస్‌ ఆఫర్స్‌ ఎలాగున్నాయనేది ఊహించుకోండి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English