బాలకృష్ణ అందుకు ఫిట్‌ కాదు

బాలకృష్ణ అందుకు ఫిట్‌ కాదు

'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' ప్రచారంలో వర్మ జోరు పెంచాడు. కాంట్రవర్సీకి మీడియా ఆకర్షితం అవుతుందనేది వర్మకి బాగా తెలుసు. అందుకే తన సినిమాల్లో మీడియాని ఆకట్టుకునే అంశాలుండేలా చూసుకుంటాడు. ఎన్ని సినిమాలు ఫ్లాపయినా వర్మ చిత్రాలకి ప్రచారం లభించేది అందుకే. ఎన్టీఆర్‌ జీవితంలోని చివరి అంకాన్ని, నందమూరి అభిమానులు అంతగా గర్వపడని పార్శ్వాన్ని చూపిస్తానంటూ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' మొదలు పెట్టిన రాంగోపాల్‌వర్మ ఈ చిత్రంలో నిజాలు మాత్రమే చూపిస్తానంటున్నాడు. ఎన్టీఆర్‌ బయోపిక్‌కి పోటీగా విడుదల చేద్దామని చూస్తోన్న ఈ చిత్రం సంగతి అటుంచితే, ఎన్టీఆర్‌ బయోపిక్‌ మొదటిభాగం అయిన 'కథానాయకుడు' వర్మ ఇంకా చూడలేదట.

ఎందుకూ అంటే బాలకృష్ణ పెద్ద స్టారే అయి వుండవచ్చు కానీ ఎన్టీఆర్‌ పాత్ర పోషించడానికి బాలకృష్ణ సరిపోడని, ఎన్టీఆర్‌ మాదిరిగా బాలయ్య ఎప్పుడూ నటించలేడని అన్నాడు. తాను ఎన్టీఆర్‌కి వీరాభిమాని కనుక ఆయన పాత్రలో బాలకృష్ణని చూడలేనన్నాడు. అయితే ఇక్కడ తిరకాసు ఏమిటంటే... ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేద్దామని బాలయ్య అనుకున్నపుడు వర్మ పేరునే ముందుగా పరిశీలించాడు. కానీ తర్వాత వద్దనుకోవడంతో వర్మకి ఈగో హర్ట్‌ అయి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తలపెట్టాడు. తీరా ఇప్పుడేమో ఆ పాత్ర చేయడానికి బాలయ్య అనర్హుడని చెబుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English