లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రెయిలర్‌తోనే రచ్చ షురూ

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ ట్రెయిలర్‌తోనే రచ్చ షురూ

ఇంతకుముందు రక్తచరిత్ర, వంగవీటి లాంటి చిత్రాలతో అంచనాలు పెంచిన రాంగోపాల్‌వర్మ తీరా సినిమాలో వాస్తవాలని చూపించకుండా ఆ టైమ్‌లో ఎవరు పవర్‌ఫుల్‌గా వున్నారో వారిని హైలైట్‌ చేసాడు. వర్మ సంచలనాత్మక సబ్జెక్ట్‌ ఎంచుకున్నా కానీ ధైర్యంగా సినిమా తీయలేడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే మొదటిసారి ఎవరికీ వెరవకుండా తనకి తెలిసింది తీసాడట లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో. ఈ చిత్రంలో చంద్రబాబుకి, బాలకృష్ణ, ఇతర నందమూరి సోదరులకి డ్యామేజ్‌ చేసే సంభాషణలు, సన్నివేశాలు చాలా వున్నాయట. ఎన్టీఆర్‌ - లక్ష్మిపార్వతిది గొప్ప లవ్‌స్టోరీగా ఫీలయ్యే ట్రెయిలర్‌ని ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నాడట.

ఈ ట్రెయిలర్‌ చూసిన వారు ఇది చాలా పెద్ద రచ్చ చేస్తుందని, ఇంతకాలం ఈ చిత్రాన్ని తేలికగా తీసుకున్న వారు ట్రెయిలర్‌ చూసాక అలర్ట్‌ అవుతారని, డ్యామేజ్‌ కంట్రోల్‌ చేయడానికి అయినా సినిమా విడుదల ఆపేయడానికి ప్రయత్నాలు జరుగుతాయని చెబుతున్నారు. తను నిజాలు అనుకునేవి వర్మ చాలా పచ్చిగా చూపించాడట. ఇది చంద్రబాబు రెప్యుటేషన్‌ చెడగొట్టే విధంగా వుండడమే కాకుండా రానున్న ఎన్నికల్లో డ్యామేజ్‌ చేసేలాను వుందట. అందుకే దీనిని నిలిపి వేసే అవకాశాలున్నాయనే టాక్‌ మొదలైంది. అదే జరిగిన నేపథ్యంలో వర్మ డిజిటల్‌ రిలీజ్‌కి తెగించే సాహసం చేస్తాడా లేదా అనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English