మీడియాకి గడ్డి పెట్టిన హీరోయిన్‌

మీడియాకి గడ్డి పెట్టిన హీరోయిన్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పని అయిపోయిందన్నట్టు రాస్తోన్న మీడియాకి తనలో సత్తా ఇంకా వుందని, అవకాశాలు వస్తూనే వున్నాయని ఆమె గుర్తు చేస్తోంది. 'దేవ్‌'తో మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతున్న రకుల్‌ మరో చిత్రం 'ఎన్‌జికె'లో సూర్యతో నటిస్తోంది. ఆ చిత్రం వేసవిలో విడుదల కానుంది. హిందీలో ఒక రెండు చిత్రాలతో రకుల్‌ బిజీగా వుంది. చాలా గ్యాప్‌ తర్వాత తెలుగులో ఫుల్‌ఫ్లెడ్జ్‌డ్‌ క్యారెక్టర్‌ 'వెంకీ మామ'లో లభించింది. ఈ ఏడాదిలో అయిదు సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయని, ఇంతకంటే ఒక హీరోయిన్‌ చేసేది ఏముంటుందని, తన పని అయిపోయిందని ఎలా రాస్తారని ఆమె ప్రశ్నిస్తోంది.

వివిధ భాషల్లో నటించడం మీద శ్రద్ధ పెడుతున్నానని, అంచేత మునుపటిలా తెలుగులో ఎక్కువ సినిమాలు లేవని, డేట్స్‌ క్లాష్‌ కావడం వల్ల కొన్ని తెలుగు చిత్రాలు వదులుకోవాల్సి వచ్చిందని చెప్పింది. ఈ ఏడాది తమిళ, హిందీ చిత్రాలు ఎక్కువ వుంటే వచ్చే యేడాది తెలుగులో ఎక్కువ చిత్రాలు చేస్తానంటోంది. ఎవరినైనా తక్కువ చేయడానికి, రైట్‌ ఆఫ్‌ చేయడానికి మీడియా ముందుంటుందని, నెగెటివిటీ స్ప్రెడ్‌ చేయడం కంటే వాస్తవాలను తెలుసుకుని పాజిటివ్‌గా వుంటే బాగుంటుందని సజెస్ట్‌ చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English