అర్జున్‌ ఆమె గొంతు నొక్కేసాడా?

అర్జున్‌ ఆమె గొంతు నొక్కేసాడా?

సీనియర్‌ హీరో అర్జున్‌ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, షూటింగ్‌లో నరకం చూపించాడని సంచలన ఆరోపణలు చేసింది శృతి హరిహరన్‌. మీటూ ఉద్యమంలో భాగంగా పలువురు తారలు ఇచ్చిన కన్ఫెషన్స్‌లో శృతి కూడా శృతి కలిపిన సంగతి తెలిసిందే. సౌత్‌ ఇండియన్‌ సినిమా నుంచి అర్జున్‌లాంటి పాపులర్‌ స్టార్‌ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం సంచలనం సృష్టించింది. అప్పట్లో అర్జున్‌పై ఆమె పోలీస్‌ కేస్‌ కూడా పెట్టింది.

అయితే ఈ వ్యవహారంలో తెరచాటు మంతనాలు జరిగిపోయాయని, శృతి గొంతు నొక్కేసారని, ఆమె ఇప్పుడు అర్జున్‌ వైపు మొగ్గు చూపుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు అర్జున్‌ సమీప బంధువు, కన్నడ హీరో చిరంజీవి సర్జాతో శృతి ఒక సినిమాకి సంతకం చేసింది. రాజీ ప్రయత్నాలు సఫలం కానట్టయితే శృతికి అతని సినిమాలో అవకాశం రాదని, దీనిని బట్టి ఆమె సైలెంట్‌ అయిపోయినట్టే అనుకోవచ్చని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. అర్జున్‌పై పెట్టిన కేసు కూడా ఇంకా విచారణ దశలోనే వుండడం గమనార్హం. ఆ కేసుని శృతి నెమ్మదిగా విత్‌త్రా చేసేసుకుంటుందని వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English