మహానాయకుడు ఆగమనం ఆ రోజే..

మహానాయకుడు ఆగమనం ఆ రోజే..

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇంతకుముందు ‘మహానాయకుడు’ను ఫిబ్రవరి 7కు షెడ్యూల్ చేయడం తెలిసిన సంగతే. ఐతే ఆ రోజుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తేలేకపోయారు. షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను వాయిదా వేశారు. రిలీజ్ డేట్ విషయంలో కొన్ని రోజులుగా తర్జన భర్జన నడుస్తోంది. ఐతే ఎట్టకేలకు సందిగ్ధతకు తెరపడింది. ఫిబ్రవరి 22న ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. శివరాత్రి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

‘యన్.టి.ఆర్-కథానాయకుడు’కి బాక్సాఫీస్ దగ్గర దారుణమైన పరాభవం ఎదురైన నేపథ్యంలో ‘మహానాయకుడు’ విషయంలో గుంభనంగా ఉంటోంది చిత్ర బృందం. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి ప్రచార హడావుడి ఏమీ లేకపోయింది. తొలి భాగానికి వచ్చిన ఫలితం టీంను నైరాశ్యంలోకి నెట్టి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు రెండో భాగం గురించి ఉత్సాహంగా మాట్లాడ్డానికి కూడా అవకాశం లేకపోయింది. అయినప్పటికీ ప్రమోషన్ మొదలుపెట్టక తప్పదు. త్వరలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా చేయబోతున్నారట. ఐతే సంక్రాంతి లాంటి సీజన్లో భారీ అంచనాల మధ్య వచ్చి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘కథానాయకుడు’నే ప్రేక్షకులు ఆదరించనపుడు.. అన్ సీజన్లో, తక్కువ అంచనాలతో వస్తున్న ‘మహానాయకుడు’ పరిస్థితి ఏమవుతుందో చూడాలి. రెండో భాగంలో ఎన్టీఆర్ రాజకీయ జీవితం, చరమాంకంపై ప్రధానంగా దృష్టిసారించిన నేపథ్యంలో ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారేమో చూాడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English