విజయ బాపినీడు.. ఆ ఒక్క సినిమా చాలు

విజయ బాపినీడు.. ఆ ఒక్క సినిమా చాలు

ఈ రోజు అనారోగ్యంతో మృతి చెందిన దర్శకుడు విజయ బాపినీడు గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. టాలీవుడ్లో ఆయన పేరు వినిపించిన చాలా కాలం అయింది. ఆయన చివరి సినిమా ‘కొడుకులు’ విడుదలై దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ఆయన సినిమాలు తీయడం మానేశారు. ఐతే 80లు, 90ల్లో సినిమాలు చూసిన వాళ్లకు విజయ బాపినీడు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

ఆయన తీసిన మిగతా సినిమాలన్నీ ఒకెత్తయితే.. మెగాస్టార్ చిరంజీవితో తీసిన సినిమాలు మరో ఎత్తు. ఐతే చిరుతో తీసిన వాటిలో కూడా మిగతా చిత్రాలన్నీ ఒకెత్తయితే.. ‘గ్యాంగ్ లీడర్’ మరో ఎత్తు. ఈ ఒక్క సినిమా చాలు విజయ బాపినీడు అంటే ఏంటో చెప్పడానికి. తెలుగు సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రమిది.

కంటెంట్ పరంగా ఉన్నతంగా నిలవడమే కాదు.. కమర్షియల్‌గా చరిత్రాత్మక విజయాన్ని సాధించింది ‘గ్యాంగ్ లీడర్’. చిరు అంత స్టైలిష్‌గా, అంత ట్రెండీగా కనిపించిన చిత్రం మరొకటి కనిపించదు. లుక్, స్టైల్, బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ పరంగా చిరు కెరీర్లోనే ది బెస్ట్ ‘గ్యాంగ్ లీడర్’ అనడంలో మరో మాట లేదు. బలమైన కథాకథనాలు.. తిరుగులేని హీరోయిజం.. విలక్షణమైన విలనిజం.. అదిరిపోయే పాటలు, ఫైట్లు.. ఇలా అన్ని రకాలుగా ఉన్నతంగా నిలిచే చిత్రమది. అప్పట్లో ఈ చిత్రం ఆంధ్ర దేశాన్ని షేక్ చేసేసింది. కలెక్షన్ల మోత మోగించేసింది.

విజయ బాపినీడు దీని కంటే ముందు, తర్వాత తీసిన సినిమాలకు దీనికి అసలు పోలికే ఉండదు. దీని స్టైల్ వేరు. దీని స్టామినా వేరు. ఈ ఒక్క సినిమాతో బాపినీడు దర్శకుడిగా ఎక్కడికో వెళ్లిపోయాడు. మెగా అభిమానులకు ఆయన ఫేవరెట్ అయిపోయారు. చిరుతో ఇంకా ‘మగ మహారాజు’.. ‘ఖైదీ నంబర్ 150’.. ‘మగధీరుడు’.. లాంటి హిట్లు అందించిన బాపినీడు.. చివరగా మెగాస్టార్‌తో ‘బిగ్ బాస్’ తీశాడు. అది ఫ్లాప్ కావడంతో ఆయన జోరు తగ్గిపోయింది. ‘కొడుకులు’ తర్వాత ఇండస్ట్రీలో కనిపించడం మానేశాడు. చిరు మీద వ్యక్తిగతంగానూ ఎంతో అభిమానం చూపిన బాపినీడు.. ఆయన అభిమానుల కోసం ‘చిరంజీవి’ పేరుతో ప్రత్యేకంగా ఒక మ్యాగజైన్ కూడా నడపడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English