కార్తి ఒక్కడికే కాదు.. ఆమెకూ కావాలి

కార్తి ఒక్కడికే కాదు.. ఆమెకూ కావాలి

కోలీవుడ్ హీరో కార్తీ తెలుగులో కూడా స్టార్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మినిమామ్ వసూళ్లను రాబట్టే ఈ హీరో నుంచి వచ్చిన చివరి సినిమా చినబాబు తెలుగు ఆడియెన్స్ ని మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు రకుల్ తో జతకట్టి దేవ్ సినిమాతో రాబోతున్నాడు. రకూల్ ప్రీత్ సింగ్ కూడా హిట్టందుకొని చాలా కాలమవుతోంది.

మెయిన్ గా ఆమెకు సోలో తెలుగు హిట్ చాలా అవసరం. దేవ్ సినిమా హిట్టయితేనే ఇక్కడ అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కార్తీ దేవ్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. టాలీవుడ్ లో కూడా సినిమా తప్పకుండా అందరిని ఆకట్టుకుంటుందని చెబుతున్నాడు. అయితే సినిమాకు అనుకున్నంతగా బజ్ ఏమి రావడం లేదు. సినిమా రిలీజ్ కావడానికి ఇంకా కొంత సమయమే ఉంది. ప్రమోషన్ డోస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు టీజర్..సాంగ్స్ పోస్టర్స్ ఏవి కూడా సినిమాకు బూస్ట్ ఇవ్వలేదు. మరి కార్తి ఏం చేస్తాడో ఏమో గాని మొదటి హిట్ ఇచ్చిన తెలుగు ఆడియెన్స్ ని ఈసారి మెప్పించకపోతే ఇక్కడ మార్కెట్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.

ఇకపోతే దేవ్ సినిమా తేడాపడినా కూడా రకుల్ చేతిలో వెంకీ మామ సినిమా ఉంది. కాని చాలారోజుల తరువాత తెలుగులో మెరుస్తున్నప్పుడు హిట్టు లేకుండా తళుక్కుమంటే ప్రొడ్యూసర్లకు కూడా కిక్కు పోతుంది అమ్మడి మీద. కాదంటారా? అందుకే దేవ్ హిట్ అవ్వడం అనేది ఇటు కార్తీకి అటు రకుల్ కు చాలా అవసరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English