యాక్టింగ్ రాకపోయినా 10 సినిమాలు

యాక్టింగ్ రాకపోయినా 10 సినిమాలు

యాక్టింగ్ ఎంత వచ్చినా రొటీన్ గా అనిపిస్తేనే సినిమా ఇండస్ట్రీలో అవకశాలు రావడం చాలా కష్టం. అలాంటిది యాక్టింగ్ లో రివర్స్ గా విమర్శలు తెచ్చుకున్న చబ్బీ బ్యూటీ మెహ్రీన్ పిర్జాదా మాత్రం ఇండస్ర్టీకి వచ్చిన మూడేళ్లలో పది సినిమాలు చేయడం అంటే చాలా లక్కీ అని చెప్పాలి. మొదటి సినిమా కృష్ణ గాడి వీర ప్రేమగాథ సినిమా వచ్చి కరెక్ట్ గా మూడేళ్లవుతోంది. ఈ సందర్భంగా ఓమారు అమ్మడు మీద ఓ లుక్కేద్దాం పదండి.

నిజానికి నానితో చేసిన డెబ్యూ సినిమాలో అక్కడక్కడ బాగానే నటించింది మెహ్రీన్. కాకపోతే హెవీ సీన్స్ రాకపోవడంతో పెద్దగా తేడా కొట్టలేదు గాని ఆ తరువాత రాజా ది గ్రేట్ సినిమాలో మాత్రం బేబీ నటనలో ఒక క్లారిటీ వచ్చింది. అంతకుముందు మహానవవుడులో ఆమె బరువెక్కిన తీరు కూడా నెగిటివ్ కామెంట్స్ ను అందించింది. కెరీర్ మొదట్లో వరుసగా మూడు హిట్స్ అందేసరికి పిల్ల లక్కు మాములుగా లేదని ఒక ప్రింట్ పడింది. అనంతరం వరుసగా అవకాశాలు రాగా అవన్నీ ప్లాప్స్ లిస్ట్ లో చేరిపోయాయి. బాలీవుడ్ లో అనుష్క శర్మ ప్రొడక్షన్ లో చేసిన ఫిలౌరి సినిమా కొంత బూస్ట్ ఇచ్చినా తెలుగులో చేసిన పంతం - జవాన్ అలాగే కేరాఫ్ సూర్యా - నోటా - కవచం సినిమాలు బెడిసికొట్టాయి. చివరకు రీసెంట్ గా వచ్చిన F2 తో అమ్మడు తమన్నాతో కలిసి సక్సెస్ ని షేర్ చేసుకుంది.

ఇక ఫ్లాపు సినిమాల్లో కూడా చాలామంది హీరోయిన్లు ఆకట్టుకుంటారు కాని.. మెహ్రీన్ మాత్రం నటన పరంగా పెద్దగా ప్రశంసలు అందుకోలేదు. అయినా కూడా మూడేళ్ళలో పది సినిమాలతో బాగానే నెట్టుకొచ్చింది. ఈ సందర్భంగా F2 బ్యూటీ నెక్స్ట్ మంచి కథలను ఎంచుకుంటూ యాక్టర్ గా కూడా మరింతగా ఎదిగేందుకు కృషి చేస్తాను అని వివరణ ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English