మమ్ముట్టి యాత్ర సాఫీగా సాగట్లేదే

మమ్ముట్టి యాత్ర సాఫీగా సాగట్లేదే

బయోపిక్ అంటే జీవితంలో మెయిన్ పాయింట్ ని హైలెట్ చేస్తూ తెరకెక్కిస్తే ప్రేక్షకుల్లో ఎంతవరకు ఆసక్తి ఉంటుందో గాని యాత్ర సినిమా రిలీజ్ అనంతరం అందరికి ఓ క్లారిటీ వచ్చి ఉంటుంది. వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం మొత్తం కాకుండా కేవలం పాదయాత్ర బ్యాక్ డ్రాప్ లో వచ్చిన యాత్ర ఓపెనింగ్స్ (6కోట్ల షేర్స్) గట్టిగానే అందుకున్నప్పటికి ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి తగ్గినట్లు అనిపిస్తోంది.

ముఖ్యంగా ఓవర్సీస్ లో రిలీజ్ కు ముందు కాస్త హంగామా చేసిన యాత్ర ,అక్కడ పెద్దగా వసూళ్లను రాబట్టుకోలేకపోయింది. ప్రమోషన్ డోస్ గట్టిగానే ఉన్నప్పటికీ ఎన్ని యాడ్స్ ఇచ్చినా కూడా యూఎస్ లో అనుకున్నట్టుగా వసూళ్లను అందుకోలేదనేది ట్రేడ్ వర్గాల టాక్. ఇప్పటికీ కూడా 200K డాలర్ల(70 లక్షలు) మార్క్ ని రాబట్టలేదు. కేవలం వైఎస్సును ఒక దేవుడిగా చూపించేద్దాం అని అనుకున్న దర్శకుడు మహి వి రాఘవ అంచనాలు చాలా వరకు రివర్స్ అయ్యాయి. ఇక మలయాళం మెగాస్టార్ మమ్ముంటి స్టార్ డమ్ కూడా సినిమాకు పెద్దగా ఉపయోగపడలేదు.

సినిమాకు మిలియన్ డాలర్లు వస్తాయని గట్టిగా ఆశలు పెట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కి ఓపెనింగ్స్ సంతృప్తిని ఇవ్వలేకపోవడంతో.. ఇప్పుడు టిక్కెట్ల మీద ఆఫర్స్ పెట్టి కలక్షన్లను పెంచుకోవాలని చూస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English