రాహుల్ గాంధీ సినిమా.. రికార్డ్ బ్రేకింగ్ టీజ‌ర్

రాహుల్ గాంధీ సినిమా.. రికార్డ్ బ్రేకింగ్ టీజ‌ర్

ప్ర‌స్తుతం ఇండియాలో బ‌యోపిక్స్ హ‌వా న‌డుస్తోంది. అందులోనూ ఎన్నిక‌ల హ‌డావుడి నేప‌థ్యంలో రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్స్ వ‌రుస క‌ట్టేస్తున్నాయి. ఇప్ప‌టికే ద‌క్షిణాదిన మాజీ ముఖ్య‌మంత్రులు ఎన్టీఆర్, వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిల మీద సినిమాలు వ‌చ్చేశాయి. మ‌రో దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత మీద ఒక‌టికి మూడు సినిమాలు తయార‌వుతున్నాయి.

ఇంకోవైపు ఉత్త‌రాది నేత‌ల మీద కూడా సినిమాలు వ‌రుస క‌ట్టేస్తున్నాయి. ఆల్రెడీ మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మీద 'ది యాక్సిడెంట‌ల్ ప్రైమ్ మినిస్ట‌ర్' అనే సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మీదా వివిధ భాష‌ల్లో ఓ సినిమా తెర‌కెక్కుతుండ‌గా.. ఆయ‌న ప్ర‌ధాన రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి, కాంగ్రెస్ ప్ర‌ధాని అభ్య‌ర్థి రాహుల్ గాంధీ మీద కూడా సినిమా తయారీలో ఉండ‌టం విశేషం.

'మై నేమ్ ఈజ్ రాగా' అనే పేరుతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇక్క‌డ రాగా అంటే రాహుల్ గాంధీ అన్న‌మాట‌. ఇంత‌కుముందు షెర్లిన్ చోప్రా ప్ర‌ధాన పాత్ర‌లో కామ‌సూత్ర సినిమా తీసిన రూపేష్ పాల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అత‌ను ఏకంగా నాలుగు నిమిషాల‌కు పైగా నిడివితో ఈ చిత్రానికి టీజ‌ర్ వ‌ద‌ల‌డం విశేషం. మామూలుగా టీజ‌ర్ ఒక నిమిషానికి అటు ఇటు నిడివితో ఉంటాయి. ట్రైల‌ర్ల నిడివి రెండు నిమిషాల పైగా ఉంటుంది.

కానీ ఏకంగా 4 నిమిషాల‌కు పైగా నిడివితో టీజ‌ర్ అంటే రికార్డే. ఈ టీజ‌ర్ చూస్తే రాహుల్ గాంధీలోని మంచిని, చెడును రెంటినీ సినిమాలో చూపించేలా క‌నిపిస్తోంది. ఇది ప్రాప‌గండా ఫిలిం లాగా లేదు. కొన్ని అంశాలు చూస్తుంటే సినిమా వివాదానికి దారి తీసేలాగా కూడా క‌నిపిస్తోంది. ఇందులో ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, ప్రియాంక‌, మోడీ, మ‌న్మోహ‌న్ త‌దిత‌రుల పాత్ర‌లున్నాయి. రాహుల్ పాత్ర‌ను అశ్విని కుమార్ చేసిన ఈ సినిమా ఎన్నిక‌ల‌కు ముందే రిలీజ‌య్యే అవ‌కాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English