యాత్ర స‌క్సెసా.. కాదా?

యాత్ర స‌క్సెసా.. కాదా?

నంద‌మూరి తార‌క రామారావు మీద తీసిన 'య‌న్.టి.ఆర్' సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దారుణాతి దారుణ‌మైన ఫ‌లితం ఎదుర‌వ‌డం ఇక వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌థ‌తో తీసిన 'యాత్ర‌' కు ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో అన్న సందేహాలు నెల‌కొన్నాయి. సినీ గ్లామ‌ర్ ఉన్న ఎన్టీఆర్ సినిమానే జ‌నాలు చూడ‌న‌పుడు.. ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడైన వైఎస్ మీద సినిమా తీస్తే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారా అన్న క్వ‌శ్చ‌న్ మార్క్ ప‌డింది.

ఐతే 'యాత్ర‌' దాని స్థాయిలో అది బాగానే ఆడుతోంది. దీనిపై పెట్టిన పెట్టుబ‌డి త‌క్కువ‌. ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు కూడా త‌క్కువే. దీంతో బాక్సాఫీస్ గండాన్ని ఈ సినిమా దాటేసేలాగే క‌నిపిస్తోంది. మంచి రిసెప్ష‌న్ తెచ్చుకున్న *యాత్ర‌* క‌మ‌ర్షియ‌ల్ గానూ స‌క్సెస్ అయ్యేలాగే ఉంది. ఈ చిత్రం తొలి వారాంతంలో రూ.6 కోట్ల షేర్ రాబ‌ట్టింది. దీని స్థాయికి ఇది మంచి షేరే.

అనుకున్న‌ట్లే రాయ‌లసీమ‌లో 'యాత్ర‌'కు మంచి వ‌సూళ్లొచ్చాయి. తొలి మూడు రోజుల్లో ఇక్క‌డ రూ.96 ల‌క్ష‌ల షేర్ రాబ‌ట్టింది యాత్ర‌. తెలంగాణ‌లో రూ.కోటి షేర్ వ‌సూలైంది. ఆంధ్రాలో రూ.2.34 కోట్ల షేర్ వ‌చ్చింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే రూ.82 ల‌క్ష‌ల షేర్ రావ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో రూ.4.3 కోట్ల షేర్ తెచ్చింది యాత్ర‌.

అమెరికాలో ప్రిమియ‌ర్స్ వ‌సూళ్లు బాగున్నా.. త‌ర్వాత ఈ చిత్రం అక్క‌డ ఆశించిన స్థాయిలో వ‌సూళ్లు రాబ‌ట్టలేదు. వీకెండ్ అయ్యేస‌రికి అక్క‌డ రూ.45 ల‌క్ష‌ల షేర్ వ‌చ్చింది. కేర‌ళ‌లో సినిమాకు స్పంద‌న అంతంత‌మాత్రంగానే ఉంది. త‌మిళ‌నాడు గురించి మాట్లాడ‌టానికేమీ లేదు. మొత్తంగా వ‌ర‌ల్డ్ వైడ్ రూ.6 కోట్ల‌కు అటు ఇటుగా షేర్ వ‌చ్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ఇంకో 7.5 కోట్ల దాకా రాబ‌ట్టాలి. *యాత్ర‌*కు రూ.13.5 కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ జరిగింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English