అబ్బా.. ఇలియినా చేయలేకపోయిందే

అబ్బా.. ఇలియినా చేయలేకపోయిందే

కాలం ఎంత పరిగెడుతున్నా.. కొంత మంది హీరోయిన్స్  వయస్సులో మాత్రం ఏ మాత్రం తేడా రావడం లేదు. తేడా వచ్చినా కూడా ఏజ్ కి తగ్గ అందాల అరబోతతో జనాలకు సరికొత్త గ్లామర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. లావెక్కినా ..సన్నబడినా అదోరకం బ్రీడ్ బ్యూటీ అన్నట్లు పిచ్చెక్కిస్తున్నారు. ఆ విషయంలో అనుష్క మహా గడసారి. సినిమాల్లో పాత్రలకు తగ్గట్టుగా మారడంతో అనుష్క ఆలోచన విధానం గురించి అందరికి తెలిసిందే.

అయితే కెరీర్ ను దాదాపు అనుష్క తో పాటే మొదలెట్టిన దేవదాస్ పిల్ల ఇలియానా అలాంటి కిక్ ఇవ్వడంలో చాలా వరకు ఫెయిల్ అయ్యింది. అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో అసలు ఆమె మన పోకిరి పిల్లేనా అని షాక్ అయ్యారు. నడుమందాలతో కవ్వించిన ఈ రాక్షసి కూడా అనుష్క తరహాలో కేర్ తీసుకుంటే పికప్ అయ్యేదేమో. నిన్న అనుష్క ఫోటోలు చూసినోళ్ళంతా ఇప్పుడు ఇలియానా గురించే ఆలోచిస్తున్నారు. అలా బొద్దుగా కాకుండా వెయిట్ ను కాస్త తగ్గించి ఉంటే గోవా బ్యూటి మళ్ళీ సూపర్ స్టార్ అయ్యి ఉండేదని వీళ్ళ ఫీలింగ్. కానీ అనుష్క తగ్గినంతగా ఇలియానా తగ్గలేదు.

టాలీవుడ్ లో ఫెయిల్యూర్స్ వస్తోన్న తరుణంలో బాలీవుడ్ ఆఫర్స్ అందుకున్న ఇల్లి సక్సెస్ వచ్చినా అనుకున్నంతగా క్లిక్ అవ్వలేదు. ఇక రీసెంట్ గా తెలుగులో మెరుద్దామని అనుకున్నా ఆ సినిమా కూడా ఫ్లాపే కావడంతో అస్సలు అమ్మడికి బ్రేక్ రాకుండా పోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English