బోయపాటి తగ్గట్లేదు అసలు

బోయపాటి తగ్గట్లేదు అసలు

ప్లాప్ వచ్చినప్పుడు ఎవరైనా సరే ఓ మెట్టు దిగి సక్సెస్ కోసం కష్టపడుతుంటారు. కానీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో మరో డిజాస్టర్ అందుకున్న హీరో బడ్జెట్ కంట్రోల్ లేకుండా సినిమా చేస్తే ఎలా ఉంటుంది. చూసిన వాళ్ళు నవ్వడం సంగతి అటుంచితే.. సినిమా రిజల్ట్ లో ఏ మాత్రం తేడా కొట్టినా నిర్మాత పర్సు రికవర్ అవ్వడం చాలా కష్టం. ప్రస్తుతం బోయపాటి - బాలయ్య కాంబినేషన్ గురించి ఓ టాక్ ఇదే తరహాలో వైరల్ అవుతోంది.

రీసెంట్ గా వినయ విధేయ రామ సినిమాతో దర్శకుడు బోయపాటి ఎలాంటి విమర్శలు అందుకున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక నందమూరి బాలకృష్ణ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ లాంటి నటుడి జీవితాన్ని తెరపై చూపించే ప్రయత్నం విఫలమైందని అందరికి తెలిసిందే. బోయపాటి తీసిన మెగా మూవీ 70+ కోట్ల బడ్జెట్ తో కంట్రోల్ లో లేకుండా తెరకెక్కింది. ఇక బాలకృష్ణతో మనోడు చేయనున్న సినిమాకు కూడా బోయపాటి 70 కోట్ల బడ్జెట్ కు టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది.

సింహా - లెజెండ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ తరువాత వీరిద్దరూ కలుస్తున్నారు అంటే జనాల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కానీ బడ్జెట్ అసలు ఓ లెవెల్ దాటి వెళ్లడం అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. బాలకృష్ణ ఆ నెంబర్ విషయంలో కాస్త ఆలోచనలో పడ్డట్లు టాక్. అందుకే బోయపాటిని ఒకసారి స్ర్కిప్ట్ లాక్‌ చేశాక బడ్జెట్ ఫైనల్ చేద్దాం అన్నారట.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English