చిరంజీవిని సీరియస్‌గా తీసుకున్నాడా?

చిరంజీవిని సీరియస్‌గా తీసుకున్నాడా?

మెగాస్టార్‌ చిరంజీవి ఇక హీరోగా ఎన్నో సినిమాలు చేసే వీల్లేదు. ఆయన వయసు ఎప్పుడో అరవై దాటేయడంతో ఇక ఆయన క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా టర్న్‌ కాక తప్పదు. అందుకే ఆయన హీరోగా చేసే మిగిలిన సినిమాలన్నీ అలా గుర్తుండిపోవాలని చరణ్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు.

కొరటాల శివతో సినిమా సెట్‌ అవడానికి చరణ్‌ కారణమట. అలాగే త్రివిక్రమ్‌తో కూడా చరణ్‌ ఒక సినిమా ఓకే చేయించాడు. చరణ్‌తోనే ఇంతవరకు త్రివిక్రమ్‌ ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా కానీ తాను ఎప్పుడయినా త్రివిక్రమ్‌తో చేసుకోవచ్చునని, చిరంజీవి ఇప్పుడే చేయాలని ఆ ప్రాజెక్టుని అటు డైరెక్ట్‌ చేసాడు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పిన త్రివిక్రమ్‌ ఎంత సీరియస్‌గా తీసుకున్నాడనేది తెలియదు.

అతనిప్పుడు అల్లు అర్జున్‌ సినిమాపైనే ఫుల్‌గా కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. ఈలోగా కొరటాలతో చిరంజీవి సినిమా మొదలయి వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల కూడా అవుతుంది. త్రివిక్రమ్‌కి ఇది కాక వేరే కమిట్‌మెంట్స్‌ వున్న నేపథ్యంలో చిరంజీవితో వెంటనే సినిమా చేస్తాడా లేదా అనేది ఇప్పటికయితే సస్పెన్సే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English