ఎన్టీఆర్‌ పరాభవానికి ఇది సమాధానమా?

ఎన్టీఆర్‌ పరాభవానికి ఇది సమాధానమా?

ఎన్టీఆర్‌ బయోపిక్‌ చిత్రాన్ని డెబ్బయ్‌ కోట్లకి విక్రయించారనే వార్తలు వచ్చినపుడు కిమ్మనలేదు ఎవరూ. నిజంగానే ఆ సినిమాకి అంత సత్తా వుందని అనుకున్నారు. తీరా సినిమా ఫ్లాప్‌ అయి ఇరవై కోట్లు కూడా వసూలు చేయలేకపోతే బాలకృష్ణకి అంత మార్కెట్‌ ఎక్కడ వుందని డెబ్బయ్‌ కోట్లకి అమ్మారని అడిగారు. బాలకృష్ణ ఎప్పుడు మాస్‌ సినిమా చేసినా మినిమమ్‌ గ్యారెంటీ వుంటుంది. అందులోను బోయపాటి శ్రీను లాంటి స్టార్‌ దర్శకుడితో చేస్తే బాలయ్య సినిమా సంచలనాలు చేస్తుంది. కానీ ఎన్టీఆర్‌ బయోపిక్‌ లాంటి డ్రామా లేని సాఫ్ట్‌ సినిమా చేయడం వల్ల వసూళ్లు రాలేదు. అలా అని బాలయ్య మార్కెట్‌ని తక్కువ చేయడానికి లేదు.

అందుకేనేమో తదుపరి చిత్రం బడ్జెట్టే డెబ్బయ్‌ కోట్లంటున్నారు. వినయ విధేయ రామతో పరాభవం చవిచూసిన బోయపాటి శ్రీను తన సత్తా చాటుకోవాలనే తహతహతో వున్నాడు. మరో వైపు బాలయ్య కూడా ఎన్టీఆర్‌ పరాజయంతో కుతకుతలాడిపోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా స్వీయ నిర్మాణంలోనే చేయనున్న బాలయ్య ఎంత ఖర్చయినా ఫర్వాలేదని అంటున్నాడట. ఎన్టీఆర్‌తో జరిగిన పరాభవానికి ఈ చిత్రం వసూళ్లతోనే సమాధానం చెప్పాలని అనుకుంటున్నారో ఏమో మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English