అనుష్క తగ్గింది కానీ ఎవరు దిగొచ్చేది?

అనుష్క తగ్గింది కానీ ఎవరు దిగొచ్చేది?

అనుష్క లావెక్కి పోయిందని, ఇక హీరోయిన్‌గా నటించే ఫిజిక్‌ లేదని వచ్చిన విమర్శలకి ఆమె పట్టుదలతో సమాధానం ఇచ్చింది. నేచురల్‌ పద్ధతుల్లో బరువు తగ్గి మళ్లీ స్లిమ్‌ అండ్‌ సెక్సీగా తయారై వచ్చింది. అనుష్క లేటెస్ట్‌ లుక్‌ చూసి అభిమానులు ఆనందంతో పరవశించిపోతున్నారు. స్వీటీ ఈజ్‌ బ్యాక్‌ అంటూ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేసేస్తున్నారు. అనుష్క బరువు తగ్గి మళ్లీ మునుపటి రూపాన్నయితే సంతరించుకుంది కానీ యువ హీరోల సరసన నటించే అవకాశాలున్నాయా? యువ హీరోలు అటుంచి మహేష్‌, ప్రభాస్‌లాంటి వారితో అయినా మళ్లీ ఛాన్స్‌లు వస్తాయా? ప్రస్తుతానికి అనుష్కకి 'భాగమతి'లాంటి చిత్రాల్లోనే చోటుంది.

అలాగే సీనియర్‌ యాక్టర్లు చిరు, బాలయ్య, నాగ్‌, వెంకీలతో నటించడానికి అవకాశముంటుంది. బాహుబలి తర్వాత బ్రేక్‌ తీసుకున్న అనుష్క టాప్‌ స్థానం నుంచి తప్పుకున్నట్టే. యంగ్‌ సూపర్‌స్టార్స్‌ సరసన తనకి అవకాశాలు రావు కనుక మళ్లీ టాప్‌ ప్లేస్‌కి చేరుకోవడం కష్టం. అలాగే బాహుబలి లాంటి బృహత్తర సినిమాలు ఎవరు తలపెట్టినా ఇక తనని హీరోయిన్‌గా ఎంచుకోవడమూ అసాధ్యం. స్వీటీ ప్రైమ్‌ అయితే అయిపోయింది కానీ ఇంకా తనకున్న బాక్సాఫీస్‌ పుల్‌ని చూపించడానికి మాత్రం స్కోప్‌ వుంది. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English