అజ్ఞాతవాసికి అగ్ని పరీక్ష

అజ్ఞాతవాసికి అగ్ని పరీక్ష

అనిరుధ్‌ రవిచందర్‌... ఈ పేరుకి ఒక టైమ్‌లో తెలుగునాట మహా హైప్‌ వుండేది. తమిళ ఇండస్ట్రీని దున్నేస్తోన్న టైమ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమనుంచి అనిరుధ్‌కి చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఎంత పెద్ద సినిమాలో ఛాన్స్‌ వచ్చినా సింపుల్‌గా రిజెక్ట్‌ చేసేవాడు. లేట్‌ చేసీ చేసీ... ఫైనల్‌గా అజ్ఞాతవాసి చిత్రంతో తెలుగు చిత్ర సీమకి పరిచయం అయ్యాడు. తన వరకు పాటలు వినసొంపయినవే ఇచ్చినా కానీ పవన్‌ ఇమేజ్‌కి తగ్గ పాటలు ఇవ్వలేకపోయాడని విమర్శలు ఎదుర్కొన్నాడు. సినిమా డిజాస్టర్‌ అవడంతో అనిరుధ్‌ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా అయిపోయాడు.

అరవింద సమేతకి అనిరుధ్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకుని మరీ మార్చేసారు. అంత పెద్ద సంగీత దర్శకుడికి అది పెద్ద అవమానమే. మామూలుగా అయితే తెలుగు సినిమాలు అంగీకరించేవాడు కాదేమో కానీ ఇప్పుడు తన సత్తా ఏమిటనేది తెలుగు చిత్ర సీమకి చూపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే జెర్సీ చిత్రానికి అడగ్గానే కారణాలు చెప్పకుండా ఓకే చెప్పాడు. మరి అరవింద సమేతకి జరిగిన పరాభవాన్ని మరిపించే విధంగా ఇందులో పాటలు చేసాడా? జెర్సీలో అనిరుధ్‌ స్వరపరిచిన పాటల్లోంచి ఒకటి గురువారం విడుదలవుతోంది. మరి ఈ అగ్ని పరీక్షలో మొదటి అంకాన్ని అనిరుధ్‌ ఎలా దాటతాడనేది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English