ఇటు నిండుగా థియేటర్లు.. అటు ఫ్రీ షో

ఇటు నిండుగా థియేటర్లు.. అటు ఫ్రీ షో

పోయినేడాది ‘రంగస్థలం’ సినిమా థియేటర్లలో బాగా ఆడుతుండగానే అది అమేజాన్ ప్రైమ్‌లోకి వచ్చేసింది. ఐతే అప్పటికే 50 రోజుల రన్ పూర్తయింది కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ‘ఎఫ్-2’ సినిమా రిలీజైన నెల రోజులకే అమేజాన్ ప్రైమ్‌లో దర్శనమిచ్చింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం నిన్న అర్ధరాత్రి సినిమా 12 గంటలకు అమేజాన్ సినిమాను లైవ్ స్ట్రీమ్ చేయడం మొదలుపెట్టింది.

విశేషం ఏంటంటే.. ఆ సమయానికి తెలుగు రాష్ట్రాల్లో ‘ఎఫ్-2’ సెకండ్ షోలు మంచి కలెక్షన్లతో నడిచాయి. చాలా థియేటర్లు నిండుగా కనిపించాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లో ఆదివారం నాలుగు షోలకు కలిపి రూ.2.5 లక్షల గ్రాస్ రావడం విశేషం. ఈ రోజుల్లో విడుదలైన నెల తర్వాత ఇలాంటి వసూళ్లు రాబట్టడం అంటే మామూలు విషయం కాదు.

‘ఎఫ్-2’తో పాటుగా రిలీజైన సంక్రాంతి సినిమాలన్నీ రెండు వారాలు తిరక్కముందే అడ్రస్ లేకుండా పోయాయి. తర్వాత వచ్చిన సినిమాలేవీ కూడా దీని ముందు నిలబడలేదు. మొన్నటి శుక్రవారం రిలీజైన ‘యాత్ర’ సైతం ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోంది. నాలుగు వారాల ముందు విడుదలైన ‘ఎఫ్-2’కే దాని కంటే ఎక్కువ వసూళ్లు వస్తున్నాయి. ఇప్పటికీ చెప్పుకోదగ్గ సంఖ్యలో థియేటర్లున్నాయి ఎఫ్-2. వీకెండ్స్‌లో షోలు పెంచుతున్నారు. ఇలా  థియేటర్లలో ఇంకా బాగా ఆడుతుండగానే.. మరోవైపు ప్రేక్షకులకు ఫ్రీగా సినిమా చూసే అవకాశం వచ్చేసింది.

కాబట్టి సోమవారం నుంచి సినిమా డల్లయ్యేందుకు అవకాశముంది. ఐతే మళ్లీ వారాంతం వచ్చేసరికి సినిమా పుంజుకున్నా ఆశ్చర్యం లేదు. సినిమాకు ఇంత లాంగ్ రన్ ఉంటుందనుకుంటే దిల్ రాజు ఇంత త్వరగా అమేజాన్లోకి వచ్చేలా డీల్ కుదుర్చుకుని ఉండడేమో. ఇకముందైనా నిర్మాతలు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడతారేమో చూడాలి. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English