నితిన్ కన్ఫ్యూజన్‌కు ఎట్టకేలకు తెర

నితిన్ కన్ఫ్యూజన్‌కు ఎట్టకేలకు తెర

టాలీవుడ్లో హిట్టు కోసం యువ కథానాయకుడు నితిన్ చేసినంత పోరాటం ఇంకెవ్వరూ చేసి ఉండరేమో. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలందుకున్న నితిన్.. ఆ తర్వాత ట్రాక్ తప్పి వరుసగా డజనుకు పైగా ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. చివరికి ‘ఇష్క్’తో గాడిన పడ్డాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అప్పుడప్పుడూ ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడ్డాడు.

ఐతే త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడితో ‘అఆ’ లాంటి భారీ విజయాన్నందుకున్న నితిన్.. ఆ విజయాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా గత ఏడాది నితిన్‌కు అస్సలు కలిసి రాలేదు. ‘ఛల్ మోహన్ రంగ’తో పాటు ‘శ్రీనివాస కళ్యాణం’ కూడా నిరాశ పరిచింది. దీంతో నితిన్ కెరీర్లో గ్యాప్ వచ్చేసింది. తన కొత్త సినిమాను పట్టాలెక్కించడానికి నితిన్ చాలా సమయమే తీసుకున్నాడు.

ఆ సినిమా.. ఈ సినిమా అంటూ సెలక్షన్లో ఇబ్బంది పడ్డ నితిన్.. చివరికి ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చేయడానికి మొగ్గు చూపాడు. కానీ ఈ చిత్రం కన్ఫమ్ అయి చాలా నెలలైనా సెట్స్ మీదికి వెళ్లకపోవడంతో దీనిపై సందేహాలు ముసురుకున్నాయి. ఎంతకీ ప్రారంభోత్సవం జరగకపోవడంతో ఈ సినిమా ఆగిపోతుందేమో అన్న ప్రచారం కూడా జరిగింది. ఐతే ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ఈ నెల 25న ‘భీష్మ’ను లాంఛనంగా మొదలుపెట్టబోతున్నారు.

ఇందులో నితిన్ లైఫ్ టైం బ్యాచిలర్ పాత్ర చేయబోతున్నాడు. ‘సింగిల్ ఫరెవర్’ అనేది దీని ఉపశీర్షిక. వెంకీ ‘ఛలో’తోనే టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ఇందులో నితిన్‌తో జోడీ కట్టబోతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ‘భీష్మ’ను నిర్మించనుంది. ప్రారంభోత్సవంతో పాటే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి.. ఏకధాటిగా షూటింగ్ జరిపి ఈ ఏడాది ద్వితీయార్ధంలో రిలీజ్ చేస్తారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English