అన్నీ పూరీనే చేశాక కొత్తేముంటుంది?

అన్నీ పూరీనే చేశాక కొత్తేముంటుంది?

ఆల్రెడీ ‘ఆంధ్రాపోరి’ సినిమాతో పూరి ఆకాశ్ హీరోగా లాంచ్ అయ్యాడు. ఐతే అప్పటికి అతను టీనేజర్. పైగా అది హీరోయిజం ఉన్న సినిమా కాదు. దాన్ని సరైన లాంచింగ్‌గా భావించలేదు ఎవ్వరూ. ‘మెహబూబా’ సినిమాతో తన కొడుకుని పూర్తి స్థాయి హీరోగా అరంగేట్రం చేయించాడు పూరి జగన్నాథ్. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో పూరి స్పీడు తగ్గింది. కొడుకును పెట్టి వరుసగా సినిమాలు తీసేయాలనుకున్న ఆయన.. జోరు తగ్గించాడు.

ఆకాశ్ రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లుగా కనిపించాడు. పూరి పేలవ ఫాంలో ఉండగా ఆకాశ్ హీరో కావడం అతడి దురదృష్టమని అన్నారు. ఇప్పుడుతన్న పరిస్థితుల్లో పూరి చేతుల్లోంచి బయటికి వస్తేనే ఆకాశ్‌కు మంచిదన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ ప్రకారమే ఆకాశ్ రెండో సినిమాను వేరే దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నట్లు ఇటీవలే సమాచారం బయటికి వచ్చింది.

ఇది మంచి పరిణామమే అనుకుంటుండగా.. ఈ రోజు ఆకాశ్ కొత్త సినిమా గురించి కొత్త సంగతులు బయటికి వచ్చాయి. ఈ చిత్రానికి ‘రొమాంటిక్’ అనే టైటిల్ కన్ఫమ్ చేశారు. ఆల్రెడీ షూటింగ్ జరుగుతున్నట్లు కూడా వెల్లడైంది. ఐతే ఈ చిత్రానికి కథతో పాటుగా స్క్రీన్ ప్లే, డైలాగులు కూడా పూరీనే సమకూర్చాడట. అంటే స్క్రిప్టు మొత్తం ఆయనదే. ఆయన చెప్పిందే కొత్త దర్శకుడు అనిల్ పాడూరి తీయబోతున్నాడు. అనిల్.. పూరీ శిష్యుడేనట. మరి పూరి స్క్రిప్టుతో ఆయన శిష్యుడు సినిమా తీస్తే కొత్తగా ఏముంటుంది.. ఇది కూడా పూరి మార్కు సినిమానే కదా అవుతుందన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

అసలు చాలా కాలంగా పూరితో సమస్యే ఆయన స్క్రిప్టులు. వక్కంతం వంశీ ఇచ్చిన ‘టెంపర్’ కథను చక్కగా తెరకెక్కించాడు పూరి. కానీ ఆయన సొంత కథలే తేలిపోయాయి. ఔట్ డేటెడ్ అయిపోయాయి. అలాంటపుడు ‘రొమాంటిక్’ మాత్రం భిన్నంగా ఉంటుందా.. ఆకాశ్‌కు ఇదేమైనా కలిసొస్తుందా అన్నది డౌట్‌గానే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English