విశ్వ‌నాథ్ సినిమాకు సిరివెన్నెల‌ను రాయ‌నివ్వ‌క‌పోతే..

విశ్వ‌నాథ్ సినిమాకు సిరివెన్నెల‌ను రాయ‌నివ్వ‌క‌పోతే..

సీతారామశాస్త్రి అనే అనామ‌కుడిని 'సిరివెన్నెల' సీతారామశాస్త్రిగా మార్చి.. తెలుగు సినీ చ‌రిత్ర‌లో ఒక ప్ర‌త్యేక అధ్యాయాన్ని లిఖించేలా చేసిన ఘ‌న‌త కళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్‌కే ద‌క్కుతుంది. అప్ప‌టికి వేటూరి, ఆరుద్ర‌, ఆత్రేయ లాంటి దిగ్గ‌జాల హ‌వా న‌డుస్తుండ‌గా.. కొత్త‌వాడైన‌ సీతారామ‌శాస్త్రిని సిరివెన్నెల సినిమాకు పాట‌లు రాయ‌డానికి ఎంచుకుని సింగిల్ కార్డ్ వేయించ‌డ‌మంటే మామూలు విష‌యం కాదు.

ఐతే విదాత త‌ల‌ఫున అనే పాట విన‌గానే అంద‌రికీ ఆయ‌న స్థాయి ఏంటో అర్థ‌మైంది. త‌ర్వాత సీతారామ‌శాస్త్రి వెనుదిరిగి చూసుకున్న‌ది లేదు. విశ్వనాథ్ తీసిన ప్ర‌తి సినిమాలోనూ ఆయ‌న పాట ఉండాల్సిందే. త‌న‌కు సినీ జీవితాన్నిచ్చిన విశ్వ‌నాథ్‌ను సీతారామ‌శాస్త్రి నాన్న‌గారు అని పిలుచుకుంటుండ‌టం విశేషం.

తాజాగా త‌న‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం రావ‌డంతో సీతారామశాస్త్రి త‌న గురువును క‌లిశాడు. ఆయ‌న‌తో త‌న ఆనందాన్ని పంచుకున్నాడు. ఈ సంద‌ర్భంగా విశ్వనాథ్ మ‌ళ్లీ ఇంకో సినిమా తీయాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. విశ్వ‌నాథ్ చివ‌ర‌గా అల్ల‌రి న‌రేష్‌తో ప‌దేళ్ల కింద‌ట 'శుభ‌ప్ర‌దం' అనే సినిమా తీసి నిష్క్ర‌మించారు. మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్ట‌లేదు. ఐతే విశ్వ‌నాథ్ మ‌ళ్లీ సినిమా తీయాల‌ని.. అందులో తాను పాట రాయాల‌ని అన్నారు సీతారామ‌శాస్త్రి.

మ‌రి మీ పాట లేకుండా విశ్వ‌నాథ్ సినిమా తీస్తే అని శాస్త్రితో అంటే.. అలాంటి ప‌రిస్థితి వ‌స్తే తాను సినీ ప‌రిశ్ర‌మ‌లోనే ఉండ‌న‌ని సిరివెన్నెల అన‌డం విశేషం. విశ్వ‌నాథ్ సినిమాలో త‌న పాట లేకుండా ఉండే వీలే లేద‌ని స్వ‌యంగా తాను ఆయ‌న‌తో అన్నాన‌ని.. కాబ‌ట్టి భ‌విష్య‌త్తులో విశ్వ‌నాథ్ సినిమా తీసినా తాను పాట రాయాల్సిందే అని.. అలా కాకుండే ప‌రిశ్ర‌మ‌లోనే ఉండ‌న‌ని.. అది త‌న పంత‌మ‌ని శాస్త్రి అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English