ఛార్మికి పర్మినెంట్‌ స్లాట్‌ ఇచ్చిన పూరి

ఛార్మికి పర్మినెంట్‌ స్లాట్‌ ఇచ్చిన పూరి

మెహబూబా చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించి చాలా డబ్బులు పోగొట్టుకున్న ఛార్మి ఇప్పుడు పూరి జగన్నాథ్‌ స్వీయ నిర్మాణంలో రూపొందుతోన్న 'ఇస్మార్ట్‌ శంకర్‌'కి కూడా నిర్మాణ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. ఈ చిత్రం కనుక లాభాలు ఆర్జిస్తే ఛార్మి గట్టెక్కుతుంది. ఇదిలావుంటే పూరి జగన్నాథ్‌ సినిమాలన్నిటికీ ఇక ఛార్మి కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. తనయుడు ఆకాష్‌ పూరితో అనౌన్స్‌ చేసిన రెండవ చిత్రం 'రొమాంటిక్‌'కి కూడా ఛార్మి సహ నిర్మాత కావడం గమనార్హం. దర్శకుడిగా బిజీగా వుంటూ నిర్మాణ బాధ్యతలు చూసుకోవడం కష్టం కనుక ఆ బాధ్యతలు పూర్తిగా ఛార్మికి అప్పగించేసాడట.

గతంలో వేరే వాళ్లని నమ్మి మనీ మేనేజ్‌మెంట్‌ వారి చేతుల్లో పెడితే పూరి జగన్నాథ్‌ని నిలువునా ముంచేసారు. అందుకే తనకి అత్యంత నమ్మకస్తురాలయిన ఛార్మికే ఆ బాధ్యతలు టోటల్‌గా అప్పగించేసాడని, ఛార్మి కేవలం నిర్మాణ నిర్వహణ పనులు మాత్రమే కాకుండా నటీనటుల డేట్స్‌ తీసుకురావడం, ప్రాజెక్టులు సెట్‌ చేయడం కూడా చేస్తోందట. దీంతో ఆమెని పక్కన పెట్టడానికి పూరి అసలు రెడీగా లేడని, ఇకపై పూరీ తీసే అన్ని సినిమాలకీ ఛార్మి ఇన్‌వాల్వ్‌ అవుతుందనే టాక్‌ బాగా వినిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English