పవన్‌కళ్యాణ్‌ తిరిగి రావడం పక్కా!

పవన్‌కళ్యాణ్‌ తిరిగి రావడం పక్కా!

'అజ్ఞాతవాసి' పవన్‌కళ్యాణ్‌ నటించిన చివరి చిత్రమని, ఇక మళ్లీ తెరపై కనిపించడని కొందరు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే పవన్‌ ఈ ఎన్నికలయిన తర్వాత మళ్లీ కెరియర్‌ కొనసాగిస్తాడని, తిరిగి మళ్లీ నటిస్తాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికలని పవన్‌ ట్రయల్‌ గ్రౌండ్‌గానే తీసుకుంటున్నాడు తప్ప తప్పకుండా విజయం కోసం ఆరాట పడడం లేదనేది చాలా మంది అభిప్రాయం. పవన్‌ తీరు చూస్తున్నా కానీ అందుకు తగ్గట్టే వుంది.

ఈ ఎన్నికలలో తనకి వచ్చే ఓట్ల శాతం చూసుకుని తద్వారా తదుపరి ఎన్నికలకి ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా సన్నద్ధమవ్వాలి అనేది ప్లాన్‌ చేసుకుంటాడనే రాజకీయ విశ్లేషకులకి కూడా అనిపిస్తోంది. అదే నిజమయితే కనుక ఎన్నికల తర్వాత పవన్‌కి చాలా సమయం లభిస్తుంది. అటు రాజకీయాలకి కాస్త సమయం కేటాయించినా కానీ సినిమాలు చేసుకోవడానికి కూడా వీలు చిక్కుతుంది. తన టర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌కి అనుగుణంగా షూటింగ్స్‌ చేస్తాడని, కనీసం ఏడాదికి ఒక సినిమా చేసే అవకాశముందని టాక్‌ వుంది. ఇంతవరకు తనకి అడ్వాన్స్‌లు చెల్లించిన నిర్మాతలకి వారి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడం కూడా ఈ వాదనకి బలాన్నిస్తోంది. పవన్‌ సినిమాలకి ఎప్పుడూ మార్కెట్‌ వుంటుంది కానీ ఈసారి ఎన్నికల్లో సీరియస్‌ రోల్‌ ప్లే చేయకపోతే వచ్చే ఎన్నికలకి అతడిని సీరియస్‌గా తీసుకుంటారా అన్నదే పెద్ద ప్రశ్న అవుతుందనుకోండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English