సినిమా ఆదాయానికి చిల్లు పడేలాగుంది

సినిమా ఆదాయానికి చిల్లు పడేలాగుంది

ఏ సినిమాకి అయినా థియేట్రికల్‌ రైట్స్‌ తర్వాత అత్యంత భారీ మొత్తం వసూలయ్యేది శాటిలైట్‌ రైట్స్‌కే. సినిమా థియేటర్లలో వచ్చినపుడు ఎంతగా ఎగబడి తొలి రోజు థియేటర్లకి వెళతారో, ఏదైనా ముఖ్యమయిన సినిమా టీవీలో మొదటి సారి వేసినపుడు కూడా అదే రీతిన టీవీలకి అతుక్కుపోతారు.

అందుకే భారీ సినిమాల ప్రీమియర్లకి బ్రహ్మాండమైన టీఆర్పీలు వస్తుంటాయి. కానీ ఇటీవల చాలా చిత్రాలకి శాటిలైట్‌ ప్రీమియర్లకి తగిన ఆదరణ లభించడం లేదు. ఇందుకు కారణం... చాలా పెద్ద సినిమాలు విడుదలయిన నెల రోజుల్లోనే అమెజాన్‌ ప్రైమ్‌లో 4కె రిజల్యూషన్‌తో వచ్చేస్తున్నాయి.

హిట్‌, ఫ్లాప్‌ సంబంధం లేకుండా అన్ని సినిమాలని నెల రోజుల వ్యవధిలో అమెజాన్‌లో స్ట్రీమ్‌ చేసేస్తున్నారు. దీంతో అటు పైరసీకి కూడా ఈ ఆన్‌లైన్‌ ప్రింట్లు భలేగా పనికొస్తున్నాయి. ఎవరికి వారు మొబైల్‌లోనే నచ్చిన సినిమాని, నచ్చినంత సేపు, నచ్చిన సీన్లని మాత్రమే చూసుకునే వీలు చిక్కుతోంది. దీంతో సహజంగానే టీవీ ప్రీమియర్లకి క్రేజ్‌ పడిపోయింది.

అమెజాన్‌ ఆదాయం కోసం నిర్మాతలు శాటిలైట్‌ బిజినెస్‌కి ఎసరు పెట్టుకునేలా వున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెజాన్‌లో సబ్‌టైటిల్స్‌తో సినిమా స్ట్రీమ్‌ అవుతుంది కనుక హిందీ డబ్బింగ్‌పై కూడా దాని ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు. రానున్న రోజుల్లో ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌కి ఎక్కువ ధర, శాటిలైట్‌ రైట్స్‌కేమో రిబేటు లభించే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English