ఎన్టీఆర్‌ దుబాయ్‌ ఎందుకెళ్లినట్టు?

ఎన్టీఆర్‌ దుబాయ్‌ ఎందుకెళ్లినట్టు?

ఒక భారీ చిత్రం చేస్తుండగా, ఆ హీరో సడన్‌గా విదేశాలకి పయనమయితే అది ఖచ్చితంగా సదరు సినిమాకి సంబంధించిన టూరే అనిపిస్తుంది. ఎన్టీఆర్‌ సడన్‌గా దుబాయ్‌ టూర్‌ వెళ్లడంతో రాజమౌళి తీస్తోన్న మల్టీస్టారర్‌ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌' కోసమే వెళ్లి వుంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఎన్టీఆర్‌ ఏదో గెటప్‌ కోసమో లేదా కొత్త లుక్‌ ప్లానింగ్‌ కోసమో ఎవరైనా స్టయిలిస్ట్‌ దగ్గరకి వెళ్లి వుంటాడని పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ ఎన్టీఆర్‌ వెళ్లింది అచ్చంగా ఫ్యామిలీ ట్రిప్‌కేనని ఖచ్చితమైన సమాచారం.

షూటింగ్‌కి కాస్త విరామం రావడంతో కుటుంబంతో కలిసి సరదాగా చిన్న ట్రిప్‌కి వెళ్లాడంతే. ఈసారి షెడ్యూల్‌ మొదలయితే దాదాపు నాలుగైదు నెలలు ఏకధాటిగా షూటింగ్‌లోనే గడపాల్సి వస్తుందట. అంచేత సమ్మర్‌ ట్రిప్‌కి కూడా ఛాన్స్‌ వుండదని ఇప్పుడొచ్చిన విరామాన్ని ఎన్టీఆర్‌ తన కుటుంబానికి కేటాయించేసాడన్నమాట.

ఎన్టీఆర్‌ లుక్‌కి సంబంధించి ఇక కొత్త ప్రయోగాలేమీ వుండవు. శారీరికంగా మునుపెప్పుడూ కనిపించని తరహాలో కనిపిస్తాడు. హెయిర్‌ స్టయిల్‌ అంటూ కూడా వుండదు. తన గిరజాల జుట్టు భారీగా పెంచుకుని 'గిరిజన యువకుడి'లా కనిపిస్తాడే తప్ప ప్రత్యేకించి ఎలాంటి గుర్తించలేని మేకప్‌లు గట్రా వుండవనేది విశ్వసనీయ సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English