అదిరిపోయే వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్

అదిరిపోయే వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్

సినిమాలతో పాటి వెబ్ సిరీస్ లు కూడా ఇప్పుడు ఏడాదికోటి చేసేలా ఉన్నారు సినీ తారలు. స్టార్ డమ్ ఎంత వచ్చినా కూడా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో చిన్నగా అడుగు వేస్తున్నారు. అందులో నిత్యా మీనన్ కూడా చేరిపోయింది. ఈ నటి ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడులో మహానటి సావిత్రిగా కనిపించిన సంగతి తెలిసిందే. హీరోయిన్ గా అవకాశాలు తగ్గినా డిఫరెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

ఇక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నుంచి వస్తోన్న 'బ్రీత్: సీజన్ 2' వెబ్ సిరీస్ లో నిత్యా కనిపించనుంది. అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తుండాగా ఆయనకు జోడిగా నిత్యా కనిపించనుంది. మొదటి సీజన్ లో మాధవన్ ద్వారా సిరీస్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇండియా మొత్తం ఈ సిరీస్ అదరగొట్టేసింది. దీంతో సిరీస్ కు తాను కూడా ఎట్రాక్ట్ అయినట్లు నిత్యా స్పందిస్తూ.. షూటింగ్ జాలిగా జరిగినట్లు వివరణ ఇచ్చింది. ఇక అందరికి ఈ సరికొత్త ప్రయోగం తప్పకుండా నచ్చుతుందని నిత్యా పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల్లో నిత్యా నటిస్తోంది. జయలలిత బయోపిక్ తో పాటు మెషిన్ మంగళ వంటి ఇంట్రెస్టింగ్ రియాలిస్టిక్ కథల్లో నటిస్తోంది. వాటితో పాటు ఈ వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెట్టడం మంచి అనుభూతిని ఇచ్చినట్లు నిత్యా తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English