రంగమ్మత్త రేంజ్ ఇది కాదు

రంగమ్మత్త రేంజ్ ఇది కాదు

యాంకర్ అనే పదానికి కొత్త అర్దాన్ని చెప్పిన వారిలో అనసూయ ఒకరు. మాటలతోనే కాకుండా అందంతో జనాల్ని తనవైపుకు తిప్పుకోవడంలో ఈ బ్యూటీ స్టైలే వేరు. కాంట్రవర్సీలో ఇరుక్కున్న .. కామెంట్స్ తో రచ్చ చేసినా ఆమె ఫాలోయింగ్ లో ఎలాంటి తేడా రాలేదు. ఇకపోతే అమ్మడు నటనలో కూడా సరికొత్త నిర్వచనాలను ఇస్తోంది. స్టేజ్ లపై గ్లామర్ డ్రెస్ లోతో రచ్చే చేసే ఈ హాట్ యాంకర్ వెండితెరపై మాత్రం డి గ్లామర్ క్యారెక్టర్స్ తో ఎటాక్ చేస్తోంది.

రంగమ్మత్త గా రంగస్థలం సినిమాలో అనసూయ చేసిన పాత్ర ఓ వైపు కుర్రకారుకు మరోవైపు ఫ్యామిలీ ఆడియెన్స్ కి చాలా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఇక యాత్ర సినిమాలో కూడా అనసూయ  మరో డి-గ్లామర్ క్యారెక్టర్ చేసింది. కానీ ఈ క్యారెక్టర్ అంతగా క్లిక్ అవ్వలేదు. సూచిత్రా రెడ్డి అనే పాత్రలో కనిపించిన అనసూయ ఆ క్యారెక్టర్ బాగా క్లిక్ అయ్యిందని అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కి ఆదరించిన జనాలకు కృతజ్ఞతలని ఇలాగే మంచి మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటాను అని వివరణ ఇచ్చింది. కాని నిజానికి ఆ రోల్ లో మ్యాటర్ ఏమీ లేదు.

అలాగే ఇటీవల F2 లో కూడా అనసూయ చేసిన పాత్రలో పెద్దగా స్పెషల్ ఏమి లేదు. అవన్నీ షార్ట్ రోల్స్ కావడంతో రంగమత్త రేంజ్ ఇది కాదు అంటూ ఆమె ఫాలోవర్స్ కామెంట్ చేస్తున్నారు. కానీ అనసూయ మాత్రం ఇలాంటి పాత్రలు చేయడం అదృష్టంగా బావిస్తున్నట్లు ఫీల్ అవుతుండడంతో అసలు రానున్న రోజుల్లో ఎలాంటి రోల్స్ లో ఆమె కనిపిస్తుందో అని సినిమా లవ్వర్స్ కు కూడా డౌట్లు వస్తున్నాయ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English