యాత్రపై ట్వీటా? ఊరుకోండి బాసూ

యాత్రపై ట్వీటా? ఊరుకోండి బాసూ

చిన్న సహాయం చేసి ఊరంతా డప్పు కొట్టుకునే వారు చాలా మంది ఉంటారు. ఓ సాయం చేసి 10 షరతులు పెట్టేవారు కోకొల్లలు. ఇప్పుడు నాగ్ యాత్ర విషయంలో సైలెంట్ గా ఉండడంతో కొంత మంది ఆయన్ను స్పెషల్ గా టార్గెట్ చేశారని అనిపిస్తోంది. వైయస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇండస్ట్రీలో ఎక్కువ లాబాల్ని పొందిన వారిలో నాగార్జున కూడా ఉన్నారు అనేది ఒక నమ్మకం.

ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందనేది పట్టించుకోని వారు మహానేత సినిమా వస్తే కనీసం ఓ ట్వీట్ చేసి సాయం చేయరా ? అంటూ డైలాగులు వదులుతున్నారు. అయితే వైఎస్ ప్రాఫిట్ లేకుండా అయితే ఎలాంటి సహాయం చేయలేదు అనేది కూడా అందరికీ తెలిసిందే. ఆయన నుంచి సాయం పొందినవారికి ఆ విషయం ఎప్పటికీ మరచిపోలేరు. అయినా సినిమా వచ్చాక ప్రతి ఒక్కరు స్పందించాలి అంటే ఎలా అని అక్కినేని అభిమానులు విమర్శలకు కౌంటర్ వేస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియో సమీపాన 7 ఎకరాల్లో ఉన్న ఫిల్మ్ స్టూడియో లు ఫిల్మ్ స్కూల్స్ మరికొన్ని ఇన్ఫ్రా బిల్డింగ్స్ .. ఆనాడు పెద్దాయన చేసిన సహాయం అంటున్నారు కాని.. తద్వారా వైఎస్ కూడా లాభం పొందినవారే. ఎందుకంటే అప్పట్లో సినిమా ఇండస్ర్టీ సపోర్టును వైఎస్సు కోసం జమకట్టడం నాగ్ చాలా సాయం చేశారు. అలాగే సాక్షి ఛానల్ పెట్టడానికి కూడా నాగ్ ఇచ్చిన ఇన్పుట్స్ అన్నీ ఇన్నీ కాదు. కాబట్టి ఇప్పుడు నాగ్ ట్వీట్లేయలేదు అనడం న్యాయం కాదనేది అభిమానుల వాదన!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English