చిరు సినిమాలో బన్నీ.. వద్దొద్దు

చిరు సినిమాలో బన్నీ.. వద్దొద్దు

మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఆయనే అతి పెద్ద ఆకర్షణ. వేరే అట్రాక్షన్లేమీ అక్కర్లేదు. ఐతే ఆయన కొత్త సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ మీద ఏకంగా రూ.200 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. దీన్ని వివిధ భాషల్లో భారీగా రిలీజ్ చేయాలనుకుంటుండటంతో ఆయా భాషలకు చెందిన నటీనటుల్ని ఎంచుకున్నారు.

హిందీ నుంచి అమితాబ్ బచ్చన్.. తమిళం నుంచి విజయ్ సేతుపతి, కన్నడ నుంచి కిచ్చ సుదీప ఈ సినిమాలో భాగమయ్యారు. నయనతార, తమన్నా లాంటి బహు భాషలకు పరిచయమున్న హీరోయిన్లు ఇందులో ఉన్నారు. మొత్తానికి ‘సైరా’కు స్టార్ అట్రాక్షన్ మామూలుగా లేదు. అవసరానికి మించి ఆకర్షణ ఉందీ చిత్రానికి. చిరు సినిమాలో ఇంతటి భారీ తారాగణం ఇంతకుముందెన్నడూ చూసింది లేదు. ఐతే వీళ్లందరూ చాలదన్నట్లు ఇప్పుడు అల్లు అర్జున్‌ను సైతం ఇందులో నటింపజేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.

చిరు సినిమాలో బన్నీ తళుక్కుమనడం కొత్తేమీ కాదు. ‘డాడీ’.. ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాల్లో అతను కనిపించాడు. ఐతే అప్పటికి బన్నీ ఇమేజ్ వేరు. ఒక సినిమాకు కొత్త, ఇంకో సినిమాకు అప్ కమింగ్ హీరో. కానీ ఇప్పుడు బన్నీ పెద్ద స్టార్ అయ్యాడు. సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నాడు. మెగా అభిమానులందు బన్నీ అభిమానులు వేరైపోయారు. మెగా అభిమానుల్లో బన్నీని వ్యతిరేకించే వాళ్లు ఎక్కువైపోయిన పరిస్థితి. బన్నీ పేరెత్తితే చాలామందికి నచ్చట్లేదు.

అతడి వ్యవహారం తేడాగా అనిపిస్తోంది. గత కొన్నేళ్లలో పరిణామాలతో బన్నీ ఫ్యాన్స్ వేరు పడిపోయారు. ఇలాంటి తరుణంలో చిరు సినిమాలో బన్నీ అనే వార్తకు పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. చిరు తన సినిమాకు ఆకర్షణ పెంచడానికి బన్నీని దించుతున్నట్లుగా సంకేతాలు వస్తుండటంతో మెజారిటీ మెగాభిమానులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ వార్త నిజమా కాదా అన్నది ఇంకా ఎవరూ ధ్రువీకరించలేదు కానీ.. చాలామంది మెగా అభిమానులు మాత్రం బన్నీ ‘సైరా’లో వద్దనే అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English