దేవ‌త‌లా చూస్తుంటే ఇలాంటి సినిమా చేసిందేంటి?

దేవ‌త‌లా చూస్తుంటే ఇలాంటి సినిమా చేసిందేంటి?

త‌మిళ బిగ్ బాస్ తొలి సీజ‌న్లో ఒవియాకు వ‌చ్చిన పాపులారిటీ ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. పెద్దగా అంచనాల్లేకుండా షోలోకి వచ్చిన ఆమె.. తనదైన వ్యక్తిత్వంతో జనాల్ని ఆకట్టుకుంది. హౌస్‌లో మిగతా వాళ్లందరూ ఆమెను ఒంటరిదాన్ని చేసి ఏడిపించడంతో బయట సింపతీ వర్కవుటైంది. భారీగా అభిమాన గణం తయారైంది ఒవియాకు. ఒవియా ఆర్మీ పేరుతో అభిమాన  సంఘాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటయ్యాయి.

తమిళ బిగ్ బాస్‌ను తొలి సీజన్లో ఒక రకంగా నిలబెట్టిన ఘనత ఒవియాకే చెందుతుంది. బిగ్ బాస్ షో పుణ్య‌మా అని ఆమెను త‌మిళ జ‌నాలు ఒక దేవ‌తలా చూడ‌టం మొద‌లుపెట్టారు. ఆమెను త‌లైవి అని కూడా పిలుచుకుంటున్నారు. ఇంత‌గా అభిమానం సంపాదించుకున్న ఒవియా.. ఒక అస‌భ్య‌క‌ర‌మైన సినిమాలో న‌టించ‌డం వివాదాస్ప‌ద‌మ‌వుతోంది.

90 ఎంఎల్.. ఒవియా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కొత్త సినిమా ఇది. ఇటీవ‌లే దీని ట్రైల‌ర్ రిలీజైంది. ఆ ట్రైల‌ర్ నిండా బూతు స‌న్నివేశాలు.. బూతు డైలాగులే. ఈ మ‌ధ్య త‌మిళంలో అడ‌ల్ట్ మూవీస్ తాకిడి ఎక్కువైంది. మ‌రీ శ్రుతి మించిపోతున్నాయి అక్క‌డి సినిమాలు. ఇటీవ‌లే తెలుగులో రీమేక్ అయిన చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు అక్క‌డి నుంచి వ‌చ్చిందే. 90 ఎంఎల్ ట్రైల‌ర్ చూస్తే దాన్ని మించిన సినిమాలా అనిపిస్తోంది. మామూలుగా అడ‌ల్ట్ సినిమాలంటే అబ్బాయిల అతే క‌నిపిస్తుంది. కానీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారులంతా అమ్మాయిలే. వాళ్ల నోట బూతు డైలాగులు వ‌స్తుంటే విన‌డానికి ఏదోలా ఉంది. స‌న్నివేశాలు కూడా అలాగే ఉన్నాయి.

అమ్మాయిలంతా అసభ్యకరంగా మాట్లాడటం, ఉమ్మడిగా కూర్చుని మద్యం తాగడం, పొగ తాగడం వంటి సన్నివేశాలు ట్రైలర్‌లో రిపీటెడ్‌గా క‌నిపించాయి. ఈ చిత్రాన్ని ఒక లేడీ డైరెక్ట‌ర్ తీయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం. ఒవియా అయితే లిప్ లాక్స్, అర్ధ‌న‌గ్న దృశ్యాల‌తో చెల‌రేగిపోయింది. ఆమెను ఇలా చూసి ఫ్యాన్స్ బాగా హ‌ర్ట‌వుతున్నారు. ఆమెను సోష‌ల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English