ఇలా అని తెలిస్తే యాత్ర తీసేవాడిని కాదు

ఇలా అని తెలిస్తే యాత్ర తీసేవాడిని కాదు

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మీద తాను తీసిన 'యాత్ర‌' సినిమాకు వస్తున్న స్పంద‌న త‌న‌కు భ‌యం క‌లిగిస్తోంద‌ని అన్నాడు ద‌ర్శ‌కుడు మ‌హి.వి.రాఘ‌వ్. వైఎస్ మీద జ‌నాల్లో ఇంత‌టి అభిమానం ఉంద‌ని.. ఈ సినిమా చూసి ఇంత‌గా స్పందిస్తార‌ని తాను ఊహించ‌లేద‌న్నాడు. తాను ఎక్కువ ఆలోచించ‌కుండా మామూలుగా ఈ సినిమా తీసేశాన‌ని.. కానీ ఇప్పుడు జ‌నాల స్పంద‌న చూశాక ఆశ్చ‌ర్యం వేసింద‌ని అత‌న‌న్నాడు.

వేల కొద్దీ ఫోన్ కాల్స్, మెసేజులు వ‌చ్చాయ‌ని.. ఒక్కొక్క‌రు స్పందించిన తీరు జీవితాంతం మ‌ర‌చిపోలేన‌ని మ‌హి అన్నాడు. జ‌నాల్లో వైఎస్ మీద ఇంత అభిమానం ఉంద‌ని, జ‌నాలు ఇలా స్పందిస్తార‌ని ముందు త‌న‌కు తెలిస్తే అంచ‌నాల‌ భ‌యంతో తాను ఈ సినిమా తీసేవాడినే కాద‌ని మ‌హి అన్నాడు.

తాను భ‌విష్య‌త్తులో 50 కోట్లు వ‌సూలు చేసే సినిమా తీస్తే తీయొచ్చ‌ని.. కానీ 500 కోట్లు వ‌సూలు చేసే సినిమా తీసినా రాని సంతృప్తిని యాత్ర ఇచ్చింద‌ని మ‌హి చెప్పాడు. అన్ని సినిమాల‌నూ వ‌సూళ్ల లెక్క‌ల్లో కొలిచి చూడ‌కూడ‌ద‌ని.. యాత్ర అలాంటిదే అని మ‌హి అన్నాడు.

ప్రాంతాల‌కు అతీతంగా జ‌నాలు యాత్ర సినిమా చూసి ఉద్వేగానికి గుర‌వుతున్నార‌ని.. తెలంగాణ నుంచి కూడా ఎంతోమంది చాలా ఎమోష‌న‌ల్ అవుతూ ఫోన్ చేశార‌ని.. ఈ సినిమా తీసి మ‌ళ్లీ రాజ‌న్న‌ను గుర్తు చేసి త‌మ‌ను చాలా బాధ పెట్టావంటూ కామెంట్ చేశార‌ని మ‌హి చెప్పాడు. రాయ‌ల‌సీమ వ‌ర‌కు ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తుంద‌నుకున్నాన‌ని.. కానీ అన్ని చోట్లా అద్భుత‌మైన ఆద‌ర‌ణ ద‌క్కుతుండ‌టం ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌ని మ‌హి అన్నాడు.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English