ఇండియన్ సినిమాకు బెర్లిన్‌లో స్టాండింగ్ ఒవేషన్

ఇండియన్ సినిమాకు బెర్లిన్‌లో స్టాండింగ్ ఒవేషన్

గత ఏడాది చివర్లో ‘సింబా’ లాంటి బ్లాక్ బస్టర్‌తో పలకరించాడు రణ్వీర్ సింగ్. అలాంటి మాస్ సినిమా తర్వాత అతను పూర్తి భిన్నమైన రూట్లో ‘గల్లీబాయ్’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ‘సింబా’, ‘గల్లీబాయ్’ సినిమాల్లో రణ్వీర్ గెటప్స్ చూస్తే.. ఈ రెండు చిత్రాల్లో హీరో ఒకరే అంటే నమ్మబుద్ధి కాదు. అంత వైవిధ్యం కనిపిస్తుంది.

సంగీతం అంటే పడి చచ్చే గాయకుడిగా.. తన కలలకు పేదరికం అడ్డొస్తుంటే తట్టుకోలేక వేదనకు గురయ్యే సగటు కుర్రాడిగా అతడి ఆహార్యం, నటన చూస్తే షాకవ్వాల్సిందే. దీని ట్రైలర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోపు ఈ చిత్రాన్ని బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. అక్కడ ప్రదర్శన పూర్తయ్యాక ఆహూతులు దీనికి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం విశేషం.

ఈ మధ్య కాలంలో ఒక ఫిలిం ఫెస్టివల్‌లో ఇలాంటి రెస్పాన్స్ చూడలేదని అంటున్నారు ఆ వేడుకకు హాజరైన వాళ్లు. రణ్వీర్ సింగ్ సహా చిత్ర బృందమంతా బెర్లిన్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్ చేసింది. అక్కడి ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి ఉబ్బితబ్బిబ్బయిపోయారందరూ. మరోవైపు ఈ ఫిలిం ఫెస్టివల్‌లోనే ‘గల్లీబాయ్’ చూసిన క్రిటిక్స్ ఆల్రెడీ రివ్యూలు కూడా ఇచ్చేశారు.
అందరూ సినిమా అద్భుతం అనే అంటున్నారు. మంచి రేటింగ్స్ ఇస్తున్నారు. రాజీవ్ మసంద్, భరద్వాజ్ రంగరాజన్ లాంటి టాప్ క్రిటిక్స్ సినిమాను కొనియాడారు. ఈ చిత్రం రణ్వీర్ కెరీర్లో మరో మైలురాయిలా నిలవడం ఖాయమంటున్నారు. ఇంతకుముందు ‘జిందగీ న దోబారా మిలేగా’.. ‘దిల్ దడ్కనే దో’ లాంటి మంచి సినిమాలు తీసిన జోయా అక్తర్ (జావెద్ అక్తర్ కూతురు, ఫర్హాన్ అక్తర్ సోదరి) ఈ చిత్రాన్ని రూపొందించింది. ఇందులో ఆలియా భట్ కథానాయికగా నటించింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English