మనోజ్ నోట.. నిలదీస్ఫైయింగ్

మనోజ్ నోట.. నిలదీస్ఫైయింగ్

సోషల్ మీడియాలో ట్రోలింగ్ కోసం కంటెంట్ ఇవ్వడంలో మంచు ఫ్యామిలీని మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరు. యూట్యూబ్‌లోకి వెళ్లి మంచు అని కొట్టగానే బోలెడన్ని ట్రోలింగ్ వీడియోలు వస్తాయి. వివిధ సందర్భాల్లో ఆ కుటుంబ సభ్యులు అన్న మాటల మీద బోలెడన్ని జోకులు.. స్ఫూలు.. పేరడీలు కనిపిస్తాయి. అందులోనూ ఈ మధ్య మంచు ఫ్యామిలీ సినిమాలు బాగా తగ్గించేసి.. ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికే పరిమితం అయిపోతోంది.

గత ఏడాది మంచు మోహన్ బాబు ఓ నేషనల్ ఛానెల్ ఇంటర్వ్యూలో వాడిన ‘ఫసక్’ అనే పదం ఎంత పాపులర్ అయిందో.. దాని మీద ఎన్ని స్ఫూపులొచ్చాయో తెలిసిందే. దాని తర్వాత మంచు లక్ష్మి ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఐ వాంట్ టు నిలదీస్ఫై’ అంటూ ఒక విచిత్రమైన పదం వాడింది. దాని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది.

ఐతే తమ మీద ట్రోలింగ్ నడిస్తే ఇంతకుముందు ఉడుక్కునేవాళ్లు కానీ.. ఇప్పుడు మంచు ఫ్యామిలీ మెంబర్స్ ఇలాంటి వాటిని చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటున్నారు. ‘ఫసక్’ పదం మీద మంచు విష్ణు సహా ఆ కుటుంబ సభ్యులంతా సరదాగా స్పందించడం తెలిసిందే. ఈ టైటిల్ పెట్టి ఒక సినిమా కూడా తీసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా వార్తలొచ్చాయి. తాజాగా మంచు మనోజ్.. ట్విట్టర్లో తన గురించి తీవ్రంగా మాట్లాడిన ఒక వ్యక్తికి బదులిస్తూ ‘నిలదీస్ఫైయింగ్’ అనే మాట వాడటం విశేషం.

ఇటీవల మనోజ్.. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం మీద మోడీని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ పెట్టడం తెలిసిందే. తాజాగా మోడీ ఏపీలో పర్యటిస్తున్న నేపథ్యంలో మనోజ్ మరోసారి స్పందించాడు. మీరు ఎన్నికల ప్రచారం కోసం ఏపీకి వస్తున్నారా.. ఇక్కడి జనాల సమస్యలు చూడ్డానికి వస్తున్నారా అని ప్రశ్నించాడు. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ముందు కేంద్రం ఇచ్చిన ఐదు లక్షల కోట్లను ఎలా ఖర్చు పెట్టాడో నారా చంద్రబాబు నాయుడిని అడుగు అంటూ.. మనోజ్‌ను ‘క్యాస్టియెస్ట్ ఇడియట్’ అని తిట్టాడు.

దీనిపై మనోజ్ స్పందిస్తూ.. పేరు వెనుక క్యాస్ట్ పెట్టుకున్నది నువ్వా నేనా (సదరు నెటిజన్ పేరు వెనుక రెడ్డి ఉంది).. మరి క్యాస్టియెస్ట్ ఇడియన్ నువ్వా నేనా అన్నాడు. చివరగా ‘ఐయామ్ నిలదీస్ఫైయింగ్’ అంటూ కూల్‌గా ట్వీట్ ముగించాడు. ఆ నెటిజన్ అంత తీవ్ర పదజాలం వాడినా మనోజ్ సంయయమనం కోల్పోకుండా ఇలా కూల్‌గా జవాబివ్వడం విశేషమే. 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English