‘యాత్ర’ గురించి అందరూ గప్‌చుప్‌యేనా?

‘యాత్ర’ గురించి అందరూ గప్‌చుప్‌యేనా?

సినిమా పరిశ్రమలో ఉన్నంత డిప్లమాటిక్ జనాలు ఇంకెక్కడా ఉండరని అంటారు. వివిధ సందర్భాల్లో వారి తీరు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. రాజకీయాల విషయంలో ఒక ఐడియాలజీ ఉన్న వాళ్లు ఇక్కడ చాలా కొద్ది మందే ఉంటారు. కేవలం అవసరాలను బట్టే రాజకీయాలపై ఇక్కడి జనాల ప్రతిస్పందన ఉంటుంది. ఇప్పుడు ఆ అవసరాలతో వ్యూహాత్మక మౌనం కూడా పాటిస్తున్నారు.

సినీ పరిశ్రమలో తిరుగులేని స్థాయిని అందుకుని.. ఆపై రాజకీయ రంగ ప్రవేశం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన సినీ పరిశ్రమకు చేసిన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి వ్యక్తి మీద సినిమా తీస్తే దాని గురించి మాట్లాడేందుకు జనాలకు నోరు రాలేదు.

ఈ చిత్రానికి కమర్షియల్‌గా మంచి ఫలితం వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఒక సినిమాగా అది ఉన్నతమైందే. కానీ దాని గురించి అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి కూడా సినీ జనాలు వెనుకంజ వేశారు. ‘యన్.టి.ఆర్-మహానాయకుడు’లో అయినా ప్రధానంగా రాజకీయాల ప్రస్తావన ఉండొచ్చు. కానీ ‘కథానాయకుడు’లో ప్రధానంగా ఎన్టీఆర్ సినీ ప్రయాణాన్నే చూపించారు. ఇందులో సినిమా.. సినీ పరిశ్రమను ఉన్నతంగా నిలబెట్టారు. అలాంటి సినిమా గురించి స్పందించడానికి స్వయంగా సినీ పరిశ్రమలోని జనాలే వెనకడుగు వేస్తే పరిస్థితి ఏంటి?

ఇప్పుడిక ‘యాత్ర’ సినిమా వచ్చింది. ఇది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తీసిన సినిమా. ఎన్టీఆర్ చిత్రం మీదే స్పందించని వాళ్లు దీని గురించి ఏం మాట్లాడతారు? ఊహించినట్లే అందరూ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. ఇక్కడ కూడా రాజకీయాల్ని దాటి చూస్తే.. ఒక సినిమాగా ‘యాత్ర’ ఉన్నతమైందే. చక్కటి నిర్మాణ, సాంకేతిక విలువలతో, మంచి ఎమోషన్‌తో సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు మహి.వి.రాఘవ్.

దీని గురించి మాట్లాడిన సినీ జనాలు అతి కొద్దిమంది. ఈ సినిమా బాగుందని ఒక మాట అంటే ఎక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో ముడిపెట్టేస్తారేమో అని భయం. మరి దర్శకుడు మారుతి.. పవన్ కళ్యాణ్‌కు ఎంతటి అభిమానో అందరికీ తెలుసు. అతను జనసేనకు పరోక్ష మద్దతుదారు కూడా. మరి అతను ‘యాత్ర’ను పొగిడితే.. వైకాపాతో అంటగట్టేశారా? లేదు కదా. మరి ఈ మాత్రం ధైర్యం కూడా లేని సినిమా వాళ్లను హీరోలుగా.. గొప్ప వాళ్లుగా ఎలా చూడాలబ్బా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English