దర్శకుడు లేకుండానే సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్

దర్శకుడు లేకుండానే సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తన బద్ధ శత్రువు కంగనా రనౌత్ సినిమా ‘మణికర్ణిక’కు పోటీగా తన కొత్త చిత్రం ‘సూపర్ 30’ని రిలీజ్ చేయాలనుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. కానీ అనుకోని విధంగా అతడి సినిమా వాయిదా పడింది. ఈ చిత్ర దర్శకుడు వికాస్ బల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర స్థాయిలో రావడంతో అతడిని అర్ధంతరంగా సినిమా నుంచి సాగనంపాల్సి వచ్చింది.

ఈ చిత్ర నిర్మాణ భాగస్వాముల్లో కూడా అతనొకడు. వికాస్ దెబ్బకు అతను, మరికొందరు కలిసి ఏర్పాటు చేసిన ‘ఫాంటమ్’ సంస్థనే మూసి వేయాల్సి వచ్చింది. కనీసం ఈ సినిమా ఫస్ట్ కాపీ తీసే వరకైనా వికాస్ ఉండుంటే సినిమా అనుకున్న ప్రకారమే విడుదలయ్యేది. అదనపు భారం పడేది కాదు. కానీ వికాస్ మీద వచ్చినవి తీవ్ర ఆరోపణలు కావడంతో అతడిపై వేటు వేయక తప్పలేదు.

వికాస్ తప్పుకునే సమయానికి టాకీ పార్ట్ దాదాపుగా పూర్తి కావచ్చింది. మిగతా పని పూర్తి చేయడానికి అతడి స్థానంలో మరో దర్శకుడిని ఎంచుకుంటారని అనుకున్నారు. కానీ అలాంటిదేమీ లేదని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ చిత్ర నిర్మాతల్లో అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఒకడు. మరికొందరు టాలెంటెడ్ పీపుల్ ఈ ప్రొడక్షన్ హౌజ్‌లో ఉన్నారు.

వీళ్లే మిగతా పని పూర్త చేయాలని నిర్ణయించుకున్నారు. కొత్త దర్శకుడిని ఎంచుకుని, అతను స్క్రిప్టును అవగాహన చేసుకుని, తన విజన్‌తో మిగతా సినిమా తీస్తే.. పోస్ట్ ప్రొడక్షన్ చేస్తే సినిమా టోన్ దెబ్బ తింటుందేమో అని భావించి ఆ ఆలోచన విరమించుకున్నారట. తమ క్రియేటివ్ టీమే సినిమాను పూర్తి చేస్తుందని.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయని.. ఇటీవల ప్రకటించినట్లే జులై 26న సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది. సూపర్ 30 పేరుతో ఇన్‌స్టిట్యూట్ పెట్టి ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ శిక్షణ ఇస్తున్న ఆనంద్ జీవి కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English