ఆ దర్శకుడి చేతికి తమిళ అర్జున్ రెడ్డి?

ఆ దర్శకుడి చేతికి తమిళ అర్జున్ రెడ్డి?

‘అర్జున్ రెడ్డి’ తమిళ రీమేక్ విషయంలో ఊహించని పరిణామాలు జరిగాయి. ఒక సినిమా పూర్తయి విడుదలకు సిద్ధం అయ్యాక.. ఔట్ పుట్ బాగా లేదని దాన్ని పూర్తిగా చెత్తబుట్టలో వేసేయడం.. హీరో తప్ప మొత్తం టీంను మార్చేసి కొత్తగా సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించడం.. దీనిపై అధికారిక ప్రకటన చేయడం.. ఇప్పటిదాకా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దాదాపుగా జరిగి ఉండదేమో. కానీ ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ విషయంలో ఇలాగే జరిగింది. బాలా లాంటి ప్రఖ్యాత దర్శకుడు చేసిన సినిమాకు ఇలా జరగడం మరీ ఆశ్చర్యం కలిగించే విషయం.

ఐతే ఎలాగూ కొత్త టీంతో మళ్లీ మొదట్నుంచి సినిమా తీయాలి అనుకున్నపుడు ఈసారైనా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సింది. కానీ ఈ ఏడాది జూన్‌లోనే సినిమా రిలీజ్ అని ప్రకటించడం ద్వారా నిర్మాతలు తమ మీద తాము ఒత్తిడి పెంచుకున్నట్లే అయింది. హీరో ధ్రువ్ సైతం ఒత్తిడిలో పడ్డాడు. ఈ ప్రెజర్ సిచువేషన్లో సినిమాను డీల్ చేయాలంటే పేరు మోసిన డైరెక్టరే ఉండాలని ఫిక్సయ్యారట. ఇందుకోసం గౌతమ్ మీనన్‌ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ గౌతమ్‌తో విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ అనే సినిమా చేస్తున్నాడు. ఇద్దరికీ మంచి సాన్నిహిత్యం ఉంది.

ఈ సాన్నిహిత్యంతోనే తన కొడుకు సినిమాను డైరెక్ట్ చేయమని విక్రమ్ అడగ్గా గౌతమ్ సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. ఇక ఆయన రంగంలోకి దిగి.. తన స్టయిల్లో స్క్రిప్ట్ రెడీ చేసి ఎప్పుడు షూటింగుకి వెళ్తాడో చూడాలి. ఐతే గౌతమ్ అయినా ‘అర్జున్ రెడ్డి’ రీమేక్‌ను సరిగా డీల్ చేయగలడా.. ప్రేక్షకుల్ని మెప్పించగలడా అన్నది సందేహం. ‘అర్జున్ రెడ్డి’ తమిళ ప్రేక్షకుల్లోకి కూడా బాగా వెళ్లిపోయింది. విజయ్ దేవరకొండకు అక్కడ భారీగా అభిమానగణం తయారైంది. ‘అర్జున్ రెడ్డి’కి బాగా అలవాటు పడిపోయిన తమిళ జనాలు.. విజయ్ స్థానంలో ఇంకెవరినీ యాక్సెప్ట్ చేయరేమో అన్న భయాలున్నాయి. ముందు నుంచి అక్కడి జనాలు ఈ సినిమా రీమేక్ పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. మరి దీన్ని అధిగమించి ధ్రువ్‌కు ప్రేక్షకుల్లో యాక్సెప్టెన్స్ తేవడమంటే కష్టమైన విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English