ఆమెతో సినిమానా.. వద్దు బాబోయ్

ఆమెతో సినిమానా.. వద్దు బాబోయ్

‘మణికర్ణిక’ డైరెక్షన్ క్రెడిట్ విషయంలో కంగనాతో పెద్ద గొడవకు దిగి.. ఆమెను మూర్ఖురాలని.. అబద్ధాల కోరు అని తీవ్ర విమర్శలు చేశాడు క్రిష్. ఐతే అలా ఆమెను తిడుతున్న సందర్భంలో కూడా ‘మణికర్ణిక’ ఒప్పుకోవడానికి ప్రధాన కారణం కంగనానే అని చెప్పాడు. దేశంలో అత్యంత ప్రతిభావంతురాలైన నటీమణుల్లో కంగనా ఒకరని కితాబిచ్చాడు.

కంగనా కాకుండా మరొకరు కథానాయిక అయితే ఈ సినిమా తాను చేసేవాడినే కాదని కూడా క్రిష్ అన్నాడు. ఇవన్నీ చెప్పి కూడా కంగనాతో పని చేయడం చాలా కష్టమని.. ఆమెకు భయంకరమైన ఇగో ఉందని.. ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ అంత ఇగో, అహంకారం ఉంటే కలిసి పని చేయడం కష్టమని అన్నాడు క్రిష్. ఇప్పుడు బాలీవుడ్లో చాలామంది నోట ఇదే మాట వినిపిస్తున్నట్లు సమాచారం. కంగనాతో వ్యవహారం అంత సులువు కాదని ఆమెతో పని చేసిన చాలా మంది అంటుంటారని బాలీవుడ్ టాక్.

హృతిక్ రోషన్, వికాస్ బల్, కరణ్ జోహార్, కేతన్ మెహతా.. ఇలా కంగనాతో విభేదాలున్న వారి సంఖ్య బాలీవుడ్లో పెద్దదే. తనతో పని చేయని వాళ్ల గురించి కూడా ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటుంది కంగనా. తాను ఓపెన్ అని, ఏదైనా ఉన్నదున్నట్లు మాట్లాడేస్తానని చెప్పుకునే కంగనా.. చాలాసార్లు హద్దులు దాటిపోతుంటుంది. ‘క్వీన్’ సినిమా చేసినన్నాళ్లూ, విడుదలయ్యాక సైలెంటుగా ఉన్న కంగనా.. ఈ మధ్య ఆ చిత్ర దర్శకుడు వికాస్ గురించి ఏవేవో ఆరోపణలు చేసింది.

కొన్నిసార్లు చిన్న విషయాల్ని కూడా ఆమె పెద్దది చేస్తుందన్న విమర్శలున్నాయి. పైగా ఈ మధ్య తానో మంచి రైటర్, డైరెక్టర్ అనే ఫీలింగ్ ఆమెకు ఎక్కువైపోయింది. దీంతో క్రియేటివ్ విషయాల్లో జోక్యం పెరిగిపోయింది. ‘మణికర్ణిక’ విషయంలో గొడవ తలెత్తడానికి కూడా అదే కారణం. పైకి చెప్పకపోయినా.. కంగనా యాటిట్యూడ్ తెలిసి ఈ విషయంలో బాలీవుడ్లో మెజారిటీ జనాలు క్రిష్‌ వైపే నిలిచినట్లు తెలుస్తోంది. ముందు నుంచే చాలామంది కంగనాను అవాయిడ్ చేస్తుండగా.. తాజా గొడవతో ఆమెతో పని చేయడానికి దర్శక నిర్మాతలు భయపడే పరిస్థితి కనిపిస్తోంది. ఎంత టాలెంట్  ఉన్నప్పటికీ ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే కంగనాతో సినిమా చేసి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకని ఆమెను బాలీవుడ్ జనాలు అవాయిడ్ చేస్తున్నారట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English